CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో భాగమైన ఆస్ట్రేలియా పర్యటన రద్దయినట్లు సీఎంవో కార్యాలయం ప్రకటించింది. ఈనెల 14వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనుండగా, 15, 16 తేదీలలో ఢిల్లీలో సీఎం పర్యటన సాగుతుంది. 15న ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. 17వ తేదీన ఢిల్లీ నుండి సింగపూర్ కు సీఎం వెళ్ళనున్నారు. 17, 18 తేదీలలో సింగపూర్ లో పర్యటించి, 19న దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. ఈనెల 23వ తేదీ వరకు దావోస్ పర్యటన సాగుతుండగా, ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో సీఎం పాల్గొంటారు. మళ్లీ ఈనెల 24వ తేదీన తిరిగి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చేరుకుంటారు.
Also Read: Chief Minister Revanth Reddy: మా టార్గెట్ అదే.. సీఐఐ సదస్సులో సీఎం రేవంత్
కాగా జనవరి 26వ తేదీన అమలు చేయాల్సిన రైతు భరోసా, నూతన రేషన్ కార్డుల పంపిణీ ఇతర కార్యక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాలను నిర్వహించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రైతు భరోసా అందాలని, అలాగే రేషన్ కార్డు లేని వారికి నూతన రేషన్ కార్డులను పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సంబంధిత జిల్లాల కలెక్టర్లకు సూచించారు. అలాగే ముక్కోటి దేవతలతో కలిసి శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చే పర్వదినం శుక్రవారం కాగా, ఆ భగవంతుడి కరుణాకటాక్షాలు అందరిపైనా ఉండాలని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు.