KL Rahul: భారత బ్యాటర్, వికెట్ కీపర్ KL రాహుల్ ( KL Rahul ) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే సిరీస్ నుంచి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడట భారత బ్యాటర్, వికెట్ కీపర్ KL రాహుల్ ( KL Rahul ). జనవరి 22న కోల్‌కతాలో ప్రారంభమయ్యే ఇంగ్లండ్‌తో జరిగే వైట్‌బాల్ సిరీస్‌లో భారత బ్యాటర్ KL రాహుల్‌కు విశ్రాంతి లభించే అవకాశం ఉంది. స్వదేశీ సిరీస్‌లో టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు T20లు, మూడు ODIలు ఉంటాయి. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే సిరీస్… ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు చాలా ముఖ్యమైనది.
Also Read: Yuzvendra Chahal – Manish pandey: చాహల్ బాటలో మరో ప్లేయర్.. భార్యకు విడాకులు ఇచ్చేందుకు నిర్ణయం ?
ఇలాంటి ముఖ్యమైన టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే సిరీస్ నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నాడట భారత బ్యాటర్, వికెట్ కీపర్ KL రాహుల్ ( KL Rahul ). అయితే, ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక జట్టులో రాహుల్ పేరు ఉంటుందని అంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ( Champions Trophy 2025 ) భాగంగానే… భారత్ తమ అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది, మిగిలిన మ్యాచ్‌లు ఆతిథ్య దేశం పాకిస్థాన్‌లో జరుగుతాయి. అయితే..టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే సిరీస్ కు కేఎల్ రాహుల్ దూరంగా ఉంటాడని… ఓ BCCI అధికారి ప్రకటన చేశాడట. ” ఇంగ్లాండ్ సిరీస్‌కు భారత బ్యాటర్, వికెట్ కీపర్ KL రాహుల్ విరామం తీసుకున్నాడు, అయితే అతను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసే జట్టులో అందుబాటులో ఉంటాడు” అని సదరు BCCI అధికారి పేర్కొన్నాడు.
కాగా…. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ( Border Gavaskar Trophy ) భాగంగా జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ బ్యాటింగ్ విఫలమైంది. కానీ పరుగులు చేసిన కొద్దిమంది బ్యాటర్లలో రాహుల్ కూడా ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన టెస్టు సిరీస్‌లో 10 ఇన్నింగ్స్‌లలో 30.66 సగటుతో 276 పరుగులతో భారతదేశం తరఫున అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు వికెట్ కీపర్ KL రాహుల్.
Also Read: South Africa Sports Minister: అఫ్గాన్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలి.. సౌతాఫ్రికా సంచలన నిర్ణయం !
అయితే.. ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ కు దూరంగా ఉండి.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ( Champions Trophy 2025 ) ఆడతానని బీసీసీఐ అధికారులకు సమాచారం ఇచ్చాడట కేఎల్ రాహుల్. దీనికి బీసీసీఐ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక ఈ గ్యాప్ లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ( Champions Trophy 2025 ) కోసం ప్రీపరేషన్ ప్రారంభించనున్నారు రాహుల్. అయితే… భారత బ్యాటర్, వికెట్ కీపర్ KL రాహుల్ ( KL Rahul ) దూరం అయితే… ఇంగ్లండ్ వన్డే సీరియస్ కోసం రిషబ్ పంత్, సంజూ శాంసన్ బరిలో ఉంటారు. ఈ ఇద్దరూ కూడా కీపింగ్ పంచుకుంటారు. అంటే వికెట్ కీపర్ KL రాహుల్ ( KL Rahul ) స్థానంలో సంజూ శాంసన్ కు అవకాశం రానుంది.