E-Paper
Advertisement

CM Revanth Reddy Delhi tour: ఢిల్లీకి సీఎం రేవంత్, కేబినెట్ విస్తరణ కోసం.. ఆపై..

CM Revanth Reddy Delhi tour: ఢిల్లీకి సీఎం రేవంత్, కేబినెట్ విస్తరణ కోసం.. ఆపై..
Advertisement

CM Revanth Reddy Delhi tour: మంత్రివర్గ విస్తరణ తుదిదశకు చేరుకోవడంతో తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి హస్తినకు వెళ్లనున్నారు. నేడు గానీ రేపు గానీ ఆయన వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈనెల ఐదు నుంచి ఆషాడం మాసం మొదలుకానుండడంతో ఈలోపే కేబినెట్ విస్తరణను చేపట్టాలని నిర్ణయించు కున్నారు.

గతవారం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఢిల్లీకి వెళ్లారు. మంత్రివర్గ విస్తరణపై పార్టీ కీలక నేతలతో చర్చిం చారు. కాకపోతే ఎవరెవరికి పదవులు ఇవ్వాలన్న దానిపై అందరూ ఒకేతాటి మీదకు రావాలని హైకమాండ్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. దాదాపుగా ఆ అంశం కొలిక్క వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

ఈసారి సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కరే ఢిల్లీకి వెళ్తున్నారని చెప్పుకొచ్చాయి. అంతా అనుకున్నట్లు జరిగితే నాలుగు లేదా ఐదున కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్ రాధాకృష్ణన్‌తో సమావేశంకావడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది.

ALSO READ: ప్రశ్నార్థకంగా బీఆర్ఎస్ ఉనికి.. ఉమ్మడి వరంగల్ లో ఖాళీ అవ్వనున్న కారు

Advertisement

పనిలోపనిగా టీపీసీసీ కొత్త చీఫ్ నియమాకం జరిగితే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నమాట. దీనిపై పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, అగ్రనేత రాహుల్‌తో రేవంత్ చర్చించిన తర్వాత ప్రకటన వెలువడనుంది. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే తెలంగాణ కేబినెట్ విస్తరణలో పడ్డారు సీఎం రేవంత్.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×