E-Paper
Advertisement

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరి హైదరాబాద్ మాటేంటి?

బంగాళాఖాతంలో అల్పపీడనం,  ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరి హైదరాబాద్ మాటేంటి?
Advertisement

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. బెంగాల్- ఒడిశా తీర ప్రాంతాలకు ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం, ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. దీని కారణంగా బెంగాల్, ఒడిషా, ఏపీ, తెలంగాణల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్షాలు

Advertisement

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ నుంచి ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల మధ్య పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. రానున్న 48 గంటల్లో ఇది ఉత్తర ఒడిశా- పశ్చిమ బెంగాల్ వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో బెంగాల్, ఒడిశా, ఏపీ, తెలంగాణల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

 

ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు

Advertisement

అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉరుములు-మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది. రాయలసీమలోని పలు జిల్లాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడనున్నాయి. ఉత్తరాంధ్రలో సముద్ర తీర ప్రాంతాల్లో వాతావరణం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంది.

 

హైదరాబాద్‌లో మధ్యాహ్నం  నుంచి కుమ్మడే కుమ్ముడు

వర్షాలు పడే సమయంలో గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా అప్రమత్తంగా సూచన చేశారు అధికారులు. సముద్రంలోకి వెళ్లిన వారు తక్షణమే తీరానికి చేరుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్పపీడన ప్రభావం తెలంగాణపై స్పష్టంగా కనిపిస్తోంది. ఆదివారం తెలంగాణలో చాలా వరకు వాతావరణం మేఘావృతమై ఉంటుంది. రానున్న 24 గంటల్లో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ALSO READ: జై కొడుతూనే జేబులు కొట్టేశారు.. మంత్రుల పర్యటనలో జేబు దొంగల హల్‌చల్

ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి – కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, నిర్మల్, నిజామాబాద్ వంటి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుండి రాత్రి వరకు కొన్ని చెదురు మదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే ఒకటి లేదా రెండు గంటల్లో భూపాలపల్లి, ములుగు, వరంగల్ గ్రామీణ, పెద్దపల్లి, హన్మకొండ, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టనున్నాయి.

Related News

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

వివేకానంద కేసు.. ఈడీ ముందుకు ఎంపీ అవినాష్‌రెడ్డి, విచారణ మరో అడుగు ముందుకెళ్లేనా?

‘మాపై కోపంతో ఆ పనులన్నీ ఆపేశారు’.. గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మంత్రి నారాయణ!

ఏపీలో మేయర్ సీట్లపై పీఠముడి.. టీడీపీ-జనసేన మధ్య ఈ ఉదయం చర్చలు, ఫెయిలైతే ఎవరిదారి వారిదే!

ఏపీలో మరో డీఎస్సీ నోటిఫికేషన్.. 2,721 ఉపాధ్యాయ పోస్టులు, వచ్చే నెల నుంచి

ఏపీలో జిల్లా పరిషత్ ఛైర్మన్లకు రిజర్వేషన్లు.. కీలక నేతలు జిల్లాలైతే..

జెడ్పీ పీఠం రేసులో బొత్స అనూష.. ప్రత్యర్థులకు గట్టి పోటీనా?

Big Stories

Advertisement
×