E-Paper
Advertisement

టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభ.. సొంతగడ్డపై కవిత బల ప్రదర్శనా? తెలంగాణ రాజకీయాల్లో చర్చ

టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభ..  సొంతగడ్డపై కవిత బల ప్రదర్శనా? తెలంగాణ రాజకీయాల్లో చర్చ
Advertisement

TRS Panchajanya Sankalpa Sabha: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత తలపెట్టిన పాంచజన్య సంకల్ప సభ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. సామాజిక న్యాయ అజెండాతో పార్టీని విస్తరించేందుకు పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. కొత్త పార్టీకి నిజమాబాద్ గడ్డపై సభ సవాళ్లతో కూడుకున్నప్పటికీ, ఆమె రాజకీయ ప్రయాణానికి తొలి పరీక్షగా మారింది.

 

నిజామాబాద్‌లో టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభ

Advertisement

తెలంగాణలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. ఒక్కోపార్టీ మెల్లగా యాక్టివేట్ అవుతున్నాయి. ప్రజల్లోకి వెళ్లేందుకు అడుగులు వేస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే.. మరో ఏడాదిలో ఎన్నికలు అన్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. కారు పార్టీకి కంచుకోటగా ఉన్న నిజామాబాద్ గడ్డ నుంచి రాజకీయంగా కొత్త అడుగులు వేస్తున్నారు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత. ఈ క్రమంలో ఆగష్టు 31న సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు  పాంచజన్య సంకల్ప సభ జరగనుంది. ఈ సభ గురించి తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ సభ ద్వారా కవిత వ్యూహం ఎలా ఉండబోతోంది? రాజకీయ వ్యూహం ఏంటి?

అన్న కోణంలో వివిధ పార్టీలు చర్చించుకుంటున్నాయి. పాంచజన్య సంకల్ప సభ కేవలం ఆ జిల్లాకి మాత్రమే కాదు. నిజామాబాద్‌ను వేదికగా టీఆర్ఎస్ ఎంచుకోవడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. సొంతగడ్డ అనే కారణం మాత్రమే కాదు, బలమైన ప్రదర్శన చేయగలిగితే రాష్ట్రవ్యాప్తంగా సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. ఆ పార్టీ కార్యాచరణకు కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉంది.

Advertisement

 

సోమవారం మధ్యాహ్నం సభ.. బల ప్రదర్శన కోసమా?

ఒక్కమాటలో చెప్పాలంటే పాంచజన్య సంకల్ప సభను భారీ బల ప్రదర్శనగా చెబుతున్నాయి పార్టీలు. ఒకప్పుడు కారు పార్టీకి కంచుకోటగా నిజామాబాద్ జిల్లా.  ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో కవిత.. బీఆర్ఎస్-బీజేపీలను అటాక్ చేసే అవకాశం ఉంది. 20 ఏళ్ల కిందట నిజామాబాద్ రాజకీయ అనుబంధాన్ని సభ వేదికగా గుర్తు చేసుకోనున్నారు కవిత. ప్రస్తుతం ఎంపీ పనితీరు, అభివృద్ధి, నిధులపై కౌంటర్ అటాక్‌ మొదలుపెట్టే అవకాశం ఉంది.

నిజామాబాద్‌లో కవిత ఓటమికి కారణం ఎవరు? అనే అంశంపై సంచలన వ్యాఖ్యలు చేసే అవకాశముందని అంటున్నారు. సొంత పార్టీ నేతలు తనను మోసం చేశారన్న గత ఆరోపణలకు మరోసారి తెరపైకి తీసుకొచ్చే అవకాశముందని అంటున్నారు. ఈ రెండు పార్టీలను ఎండగడుతూనే, కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్‌పై కవిత నోరు విప్పే అవకాశముందని అంటున్నారు.

తన హయాంలో జరిగిన అభివృద్ధి-ఇప్పుడు జరిగిన అభివృద్దిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇంతకీ పాంచజన్య సభ ఎవరికీ లాభం? ఎవరికీ నష్టం? కవిత సభతో బీఆర్ఎస్ క్యాడర్‌లో కొత్త చర్చ మొదలైంది. జాగృతి నెట్‌వర్క్‌తో కొత్త రాజకీయ బలం పెంచే వ్యూహమా? అన్న ప్రశ్న లేకపోలేదు. సభ సక్సెస్ అయితే నిజామాబాద్ నుంచి కొత్త రాజకీయ సమీకరణాలు మారవచ్చని అంటున్నారు.

ALSO READ: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరి హైదరాబాద్ మాటేంటి?

క్యాడర్‌కు భరోసా మాత్రమే, కార్యకర్తలకు నమ్మకం కల్పించడమే అసలు టార్గెట్‌గా చెబుతున్నారు. యువత, మహిళలు, రైతులు, కళాకారులు, మేధావులతో భారీ జనసమీకరణకు ప్లాన్ చేసింది టీఆర్ఎస్. సభ సక్సెస్‌తో రాష్ట్ర రాజకీయాల్లో కవిత కొత్త అడుగు వేసినట్టే.

Related News

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×