CM Revanth Reddy: తెలంగాణ మణిహారం రీజినల్ రింగ్ రోడ్ కు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో అటవీశాఖ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఇందుకోసం అటవీ – ఆర్ అండ్ బీ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని, రెండు శాఖల్లో ఒక్కో అధికారిని ప్రత్యేకంగా నియమించుకోవాలని చెప్పారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క , మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో రీజినల్ రింగ్‌రోడ్, ఆర్ అండ్ బీ, జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. నాగ్‌పూర్-విజయవాడ కారిడార్‌కు సంబంధించి తెలంగాణ జిల్లాల్లో అసంపూర్తిగా మిగిలిన భూసేకరణ ప్రక్రియను సంక్రాంతిలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Also Read: BRS Party: బీజేపీపై నో కామెంట్? బీఆర్ఎస్ సాఫ్ట్ కార్నర్? అసలు సంగతి ఇదేనా?
రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రాలకు కచ్చితంగా బీటీ రోడ్లు ఉండాల్సిందేనని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వీలైనంత వెడల్పు ఉండే విధంగా డిజైన్ చేయాలన్నారు. ఇందుకు సంబంధించి విడతల వారీగా నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి, అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రీజనల్ రింగ్ రోడ్డు, ఆర్అండ్బీ, నేషనల్ హైవే ప్రాజెక్టులపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు… pic.twitter.com/PftNq7iHfQ
— BIG TV Breaking News (@bigtvtelugu) January 3, 2025