BigTV English
Advertisement

Online Dating Scam: డేటింగ్ యాప్స్‌ మిమ్మల్ని ఎలా మోసం చేస్తాయో తెలుసా? ఆ కేసులన్నీ మీ పైనే!

Online Dating Scam: డేటింగ్ యాప్స్‌ మిమ్మల్ని ఎలా మోసం చేస్తాయో తెలుసా? ఆ కేసులన్నీ మీ పైనే!

టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ, సైబర్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. అమాయకుల భావోద్వేగాలను ఆసరాగా చేసుకునే అందినకాడికి దండుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. డిజిటల్ అరెస్ట్, బ్యాంక్ కేవైసీ లింకులు, బంపర్ ఆఫర్లు అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు డేటింగ్ యాప్స్ ను ద్వారా యువకులను టార్గెట్ చేసి నిలువునా దోచేస్తున్నారు.


డేటింగ్ స్కామ్ లో రూ. 1.2 లక్షలు పోగొట్టుకున్న యువకుడు

ఇటీవల డేటింగ్ స్కామ్ లో చిక్కి ఓ యువకుడు రూ. 1.2 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (IAS) కోసం ప్రిపేర్ అవుతున్న ఓ యువకుడికి  టిండర్ డేటింగ్ యాప్ ద్వారా వర్షా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆమె యువకుడిని ఇష్టపడుతున్నట్లు నమ్మించింది. తన పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకోవడానికి నార్త్ ఢిల్లీలోని వికాస్ మార్గ్ ప్రాంతంలోని బ్లాక్ మిర్రర్ కేఫ్‌ కు పిలిపించింది. అక్కడ వారిద్దరు స్నాక్స్, రెండు కేక్ లు, నాలుగు ఆల్కహాల్ లేని షార్ట్స్ ఆర్డర్ చేశారు. అదే సమయంలో తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి బాగాలేదని చెప్పి వర్ష అక్కడి నుంచి వెళ్లిపోయింది.


బిల్లు చూసి యువకుడి మైండ్ బ్లాంక్  

వర్షా అక్కడి నుంచి వెళ్లిపోగానే, సదరు యువకుడు బిల్లు ఇవ్వమని అడిగాడు, కేఫ్ సిబ్బంది ఇచ్చిన బిల్లు చూసి షాక్ అయ్యాడు. స్నాక్స్, రెండు కేక్ లు, నాలుగు ఆల్కహాల్ లేని షార్ట్స్ కు ఏకంగా రూ. 1.12,917 బిల్లు ఇచ్చారు. తన ఆర్డర్స్ కు ఇంత బిల్లు రావడం ఏంటని కేఫ్ సిబ్బందిని నిలదీశాడు. కేఫ్ సిబ్బంది అతడిని నిర్భందించి దారుణంగా కొట్టారు. డబ్బులు బలవంతంగా ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. సదరు యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేఫ్ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. వర్షా కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇదంతా పక్క ప్లాన్ ప్రకారం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

 డేటింగ్ యాప్స్ ద్వారా అమాయకులు బలి

సాధారణంగా  ఆన్‌లైన్ డేటింగ్ స్కామ్‌లు OkCupid, Bumble, Hinge, Tinder లాంటి యాప్స్ ద్వారా జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ యాప్స్ లో కొంత మంది యువతులు యువకులను టార్గెట్ చేసి, వారితో ప్రేమాయణం నడుపుతారు. చివరకు కలవాలని చెప్పి, వాళ్లు అనుకున్న చోటుకి రమ్మని చెప్తారు. అక్కడ, సదరు యువతులు ఖరీదైన ఆర్డర్లు చేస్తారు. మధ్యలోనే పలు కారణాలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ బిల్లు మొత్తాన్ని అమాయక యువకులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కామ్ లో యువతులతో పాటు కేఫ్ సిబ్బంది కూడా భాగస్వాములు అవుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అమ్మాయిల వెనుక పెద్ద గ్యాంగ్

నిజానికి అమ్మాయిల వెనుక పెద్ద గ్యాంగ్ ఉంటుంది. వారు రూమ్‌కు పిలుస్తారు. అక్కడ వాళ్ల వీడియోలు తీసి బెదిరిస్తారు. లేదా ఆమెపై అత్యాచారం చేశావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించి భారీగా డబ్బులు గుంజుతారు. ఇది ఒక్కసారితో ఆగిపోదు. ఒక్కసారి బుక్ అయితే.. పదే పదే నిలువు దోపిడీ చేస్తూ జీవితంపై విరక్తి కలిగేలా చేస్తారు. మీరు అత్యాచారం, హత్యాయత్నం, వేధింపులు తదితర కేసుల్లో ఇరుక్కున్నా ఆశ్చర్యపోవక్కర్లేదు. అందుకే ప్రైవేట్ మీటింగ్ లకు వెళ్లే సమయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఒకవేళ వెళ్లినా అక్కడ అనుకోని ఘటనలు జరిగితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు. వీలైనంత వరకు డేటింగ్ యాప్స్ కు దూరంగా ఉండటం మంచిదంటున్నారు. లేదంటే, ఆర్థికంగా, మానసికంగా కోలుకోలేని దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు.

Read Also: వాట్సాప్ తోనే ఎక్కువ మోసాలు, అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక!

Related News

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

Big Stories

×