CM Revanth Reddy: పద్మ అవార్డులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాయాలని నిర్ణయించు కున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రముఖుల పేర్లను కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవడం అసహనం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని మనసులోని ఆవేదనను బయటపెట్టారు.
గద్దర్ (పద్మవిభూషణ్), చుక్కా రామయ్య (పద్మభూషణ్), అందెశ్రీ (పద్మభూషణ్), గోరటి వెంకన్న (పద్మశ్రీ), జయధీర్ తిరుమలరావు (పద్మశ్రీ) ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది రాష్ట్రప్రభుత్వం. మంత్రులు, అధికారులతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడారు.
తెలంగాణకు పద్మ పురస్కారాల్లో ముమ్మాటికీ అన్యాయమే జరిగిందన్నారు సీఎం. తెలంగాణ సమాజానికి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్నలను గుర్తించకపోవడం దారుణమన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమేనని పేర్కొన్నారు.
139 మందికి పురస్కారాలు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణకు కనీసం అయిదు పురస్కారాలు ప్రకటించలేదు. తెలంగాణ నుంచి ఇద్దరికి మాత్రమే పద్మ అవార్డులు వచ్చాయి. వైద్య రంగంలో నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్, ప్రజా వ్యవహారాల్లో మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారాలు వరించాయి.
ALSO READ: గణతంత్ర దినోత్సవం.. రాష్ట్ర ప్రజలకు సీఎం మాట