BJP Leaders: మా రూటే సపరేట్ అంటున్నారు కమలనాథులు. పెట్టుబడులు, పథకాలపై మంచి చేయకపోయినా కానీ.. కోరి చేడు చేస్తున్నట్టు కనిపిస్తోంది వారి తీరు. ఇంతకీ బీజేపీ నేతల పంచాయితీ ఏంటి? వారు చేస్తున్న ఆరోపణలేంటి?
ఒకరు బొమ్మ పెట్టాల్సిందే అంటారు.. మరొకరు పారిశ్రామికవేత్తలు ఇక్కడి వారే అంటారు.. కాంగ్రెస్ సర్కార్ చేసే ప్రతి పనిని.. పనిగట్టుకొని మరీ విమర్శించడం.. లేదంటే అడ్డుపుల్ల వేయడం ఇప్పుడు పనిగా పెట్టుకున్నట్టు బీజేపీ నేతల తీరు కనిపిస్తోంది. మాములుగా ఈ పని బీఆర్‌ఎస్ చేస్తోంది. పథకాలు లేవంటారు.. తెస్తే అందరికీ న్యాయం జరగలేదంటారు.. ఆధారాలు చూపిస్తే.. మళ్లీ అడ్రస్ కనిపించదు. మళ్లీ కొత్త టాపిక్‌తో తెరపైకి వచ్చి డైవర్షన్ గేమ్స్ మొదలు పెడుతుంటారు. అయితే ఈసారి ఈ పనిని బీజేపీ నేతలు భుజానికెత్తుకున్నట్టు కనిపిస్తోంది.
ఈసారి దావోస్ పర్యటనలో రికార్డ్ స్థాయిలో పెట్టుబడులను తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. నిజానికి తెలంగాణ హిస్టరీలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలి. అయితే ఈ విషయాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా చేసేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. మాములుగా లక్షా 78 వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో అటు ఇటుగా 50 వేల ఉద్యోగాలు వరకు రావొచ్చు. కానీ ఈ విషయాన్ని పూర్తిగా పక్కదారి పట్టించేలా మాట్లాడారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
Also Read: కొత్త పీసీసీ కార్యవర్గంపై కసరత్తు.. ఛాన్స్ ఎవరికంటే..
ఇదంతా ఒకవైపు అయితే తెలంగాణ ప్రభుత్వం ఆదివారం నుంచి కీలక హామీ అమలు చేయనుంది. అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలన్న సద్దుదేశంతో ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని తీసుకొచ్చింది. అయితే కేంద్రం ఈ పథకానికి నిధులు ఇవ్వాలంటే ప్రధానమంత్రి నరేంద్రమోడీ బొమ్మ వేయాల్సిందే.. లేదంటే నిధులు రావంటూ వార్నింగ్ ఇస్తున్నారు మరో కేంద్రమంత్రి బండిసంజయ్. ఇలా ఇద్దరు కేంద్ర మంత్రులు రాష్ట్రానికి ఏం తీసుకురావాలన్న ఆలోచనతో కాకుండా.. రాష్ట్రం చేసే పనులను అడ్డగించడం.. కించపరచడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్టు కనిపిస్తోందని ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నారు.