E-Paper
Advertisement

CM Revanth reddy : తెలంగాణలో ప్రతి గడపన సౌభాగ్యం వెల్లివిరియాలి.. ప్రజలకు సీఎం న్యూఇయిర్ విషస్..

CM Revanth reddy :  తెలంగాణలో ప్రతి గడపన సౌభాగ్యం వెల్లివిరియాలి.. ప్రజలకు సీఎం న్యూఇయిర్ విషస్..
Advertisement

CM Revanth reddy : తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం రైతు, మహిళ, యువత నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నామని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. తెలంగాణలో అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన వెల్లడించారు.

కాగా, కొత్త ఏడాది సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడారు.మీ అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. నిర్భందాలు, ఇనుప కంచెలను తొలగించామన్నారు. పాలనలో ప్రజలను భాగస్వాములను చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు.

Advertisement

ప్రజాస్వామ్య పునరుద్దరించామన్నారు. పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరింటిలో రెండు గ్యారెంటీలు అమలు చేశామని తెలిపారు. కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమం అందాలన్నారు. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలన్నది మన ప్రభుత్వ ఆకాంక్ష అని రేవంత్ అన్నారు.

రాష్ట్రంలో యువత భవిత మాకు ప్రాధాన్యమన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందిస్తామన్నారు. యువత భవిష్యత్‌కు గ్యారెంటీ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

Advertisement

రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. ఈ నూతన సంవత్సరం రైతు మహిళ యువత నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత పాలనలో స్తంభించిన పోయిన పాలన వ్యవస్థ సమూల ప్రక్షాళనకు సంకల్పించామన్నారు. ప్రజా పాలనకు అనుగుణంగా వ్యవస్థల పునర్ వ్యవస్థీకరణ జరుగుతోందని రేవంత్ రెడ్డి తెలిపారు.

ప్రజల గోడు వినేందుకు ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం రేవంత్ తెలిపారు. కార్యనిర్వాహక వ్యవస్థలో మానవీయత జోడించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిపుష్ఠం చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఆర్థిక, విద్యుత్ రంగాలలో వాస్తవ పరిస్థితులను శ్వేతపత్రాల ద్వారా మీ ముందు ఉంచామన్నారు. త్వరలో సాగునీటి రంగంలో జరిగిన అవినీతిపై కూడా శ్వేతపత్రంతో వాస్తవాలు వెల్లడిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంటామన్నారు. దోపిడీకి గురైన తెలంగాణ ప్రజల సంపదను తిరిగి రాబడతామని సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు. ఆ దిశగా చర్యలు మొదలు పెట్టామన్నారు. ఫించన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల కోసం లక్షల మంది అర్హులు పదేళ్లుగా ఎదురు చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. అతి త్వరలో వారి ఆశలు ఫలిస్తాయని సీఎం హామీ ఇచ్చారు.

అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారం కోల్పోయిన ఈర్ష్యతో కొందరు అధములు చేసే తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రకటనలతో గందరగోళపడవద్దని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది గత పాలన కాదు.. జన పాలన అన్నారు.

ప్రతీ పౌరుడు ఈ ప్రభుత్వాన్ని చేరుకునేందుకు 24 గంటలు ద్వారాలు తెరిచే ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అమరులు, ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఆ కేసుల నుండి విముక్తి కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.

Tags

Related News

కోడి చెరువు వివాదం.. పవన్ కళ్యాణ్‌కు బిగ్ రిలీఫ్.. రంగనాథ్ కీలక వ్యాఖ్యలు!

హైదరాబాదీలకు షాక్.. రేపటి నుంచి క్యాబ్‌లు, ఫుడ్ డెలివరీలు బంద్!

Chief Secretary: తెలంగాణ సచివాలయంలో సమన్వయ లోపం?.. అధికారుల సీక్రెట్ మీటింగ్స్!

Rain Prayers: వర్షాల కోసం కుకుట్లపల్లి విద్యార్థుల వినూత్న ప్రార్థన!

భాగ్యనగరంలో భారీ వర్షం.. ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్!

TET Notification: తెలంగాణ ఉపాధ్యాయులకు బిగ్ అప్‌డేట్.. ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల!

రూ. 1,400 కోట్ల లెక్కలు చెప్పి మాట్లాడు.. హరీష్‌రావును ఉతికి ఆరేసిన ఉత్తమ్!

Lorry Accident: రోడ్డుపై లారీ బోల్తా.. వెల్లుల్లి సంచులను ఎత్తుకెళ్లిన స్థానికులు.. ఎక్కడంటే?

Big Stories

Advertisement
×