BigTV English

New Year celebrations : మెట్రో సర్వీస్‌ల పెంపు.. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు

Hyderabad Metro: న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా డిసెంబర్‌ 31న హైదరాబాద్‌ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లు మెట్రో ఎండీ తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి 12.15 గంటల వరకు మెట్రో రైలు సర్వీసులు నడుస్తాయని ఆయన వెల్లడించారు. చివరి మెట్రోరైళ్లు 12.15 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఒంటి గంటకు గమ్యస్థానాలకు చేరుతాయని ఆయన వెల్లడించారు. మెట్రో రైలు,స్టేషన్లలో సిబ్బంది,పోలీసుల నిఘా ఉంటుందని ఆయన వెల్లడించారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం తాగి రావద్దన్నారు. మెట్రో స్టేషన్ పరిధిలో ఎవ్వరితో అయినా దుర్భాషలాడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ హెచ్చరించారు. కావున డిసెంబర్ 31న బాధ్యతతో వ్యవహరించాలని ఆయన ప్రయాణికులను కోరారు.

New Year celebrations : మెట్రో సర్వీస్‌ల పెంపు.. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు

New Year celebrations : న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా డిసెంబర్‌ 31న హైదరాబాద్‌ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లు మెట్రో ఎండీ తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి 12.15 గంటల వరకు మెట్రో రైలు సర్వీసులు నడుస్తాయని ఆయన వెల్లడించారు. చివరి మెట్రోరైళ్లు 12.15 గంటలకు బయలుదేరి.. ఒంటి గంటకు గమ్యస్థానాలకు చేరుతాయని ఆయన వెల్లడించారు.


మెట్రో రైలు,స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని ఆయన వెల్లడించారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం తాగి రావద్దన్నారు. మెట్రో స్టేషన్ పరిధిలో ఎవరితో దుర్భాషలాడినా, ఎవరిని వేధించినా.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ హెచ్చరించారు. కావున డిసెంబర్ 31న బాధ్యతతో వ్యవహరించాలని ఆయన ప్రయాణికులను కోరారు.

కొత్త ఏడాది వేడుకల సందర్భంగా సైబరాబాద్ పరిధిలో ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. ఆదివారం రాత్రి పైవంతెన, ఓఆర్ఆర్ పై వాహనాల రాకపోకలకు ఆంక్షలు విధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆదివారం రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు అనుమతి నివాకరిస్తున్నామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే యాజమానిపై చర్యలు తీసుకుంటామన్నారు. సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తూ వాహనాలు నడిపిన వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని అవినాశ్ మహంతి హెచ్చరించారు.


Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×