BigTV English

SRH vs HCA : టికెట్ల కోసం టార్చరా? సీఎం రేవంత్ సీరియస్.. సీన్‌లోకి సూపర్ పోలీస్

SRH vs HCA : టికెట్ల కోసం టార్చరా? సీఎం రేవంత్ సీరియస్.. సీన్‌లోకి సూపర్ పోలీస్

SRH vs HCA : చిన్నచిన్న విషయాలే. కానీ, సోషల్ మీడియా జమానాలో పెద్ద డ్యామేజే జరిగిపోతోంది. ఎవరో, ఎక్కడో ఓ తప్పు చేస్తారు. దానిని అటూఇటూ తిప్పి ప్రభుత్వం మెడకు చుట్టేస్తున్నారు. అలాంటిదే SRH vs HCA గొడవ. సర్కారుకు ఏం సంబంధం లేదు. కాకపోతే, తెలంగాణ పరువే పోతోంది. ఇలాంటి వాటిని సీఎం రేవంత్‌రెడ్డి అస్సలు ఉపేక్షించట్లేదు. లేటెస్ట్‌గా.. ఐపీఎల్ టికెట్లు, పాసుల లొల్లిలో అసలేం జరిగిందో తెలుసుకోవాలంటూ విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. గతంలో హైదరాబాద్ సీపీగా ఉండి.. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బాస్‌గా ఉన్న.. మోస్ట్ పవర్‌ఫుల్, సిన్సియర్ ఆఫీసర్ అయిన కొత్తకోట శ్రీనివాసరెడ్డికి ఆ టాస్క్ అప్పగించారు ముఖ్యమంత్రి.


టికెట్ల లొల్లిపై సీఎం సీరియస్

SRH vs HCA వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. SRH యాజమాన్యాన్ని టికెట్ల విషయంలో వేధించిన అంశంపై వివరాలు సేకరించిన సీఎంవో.. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. HCA ఇబ్బంది పెట్టిందని తేలితే చర్యలు తీసుకుంటామని సీఎం వార్నింగ్ ఇచ్చారు.


కార్పొరేట్ పాసుల కోసమే గొడవంతా..

IPL కోసం ఉప్పల్ స్టేడియాన్ని తీసుకుంది SRH. ఇందుకోసంHCAకు కొన్ని టికెట్లు ఇస్తోంది. ఐతే, ఇంకా అదనంగా ఇవ్వాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ బెదిరిస్తున్నారన్నది SRH ఆరోపణ. అడిగినన్నీ టికెట్లు ఇవ్వలేదని మ్యాచ్‌కు ముందు కార్పోరేట్ బ్యాక్సుకు తాళం వేసి వేధించారని చెబుతోంది. ఇలానే కొనసాగితే తాము హైదరాబాద్‌ను విడిచి వెళ్లిపోతామంటూ సంచలన కామెంట్లు కూడా చేసింది SRH. సరిగ్గా ఇదే పాయింట్‌ను పట్టుకుని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం తెగ చేసేస్తున్నారు. మేటర్ సీరియస్‌నెస్‌ను గుర్తించిన సీఎం.. తక్షణమే విచారణకు ఆదేశించారు.

ఎవరికెన్ని టికెట్లు? తప్పెవరిది?

అగ్రిమెంట్ ప్రకారం.. స్టేడియం కెపాసిటీలో హెచ్‌సీఏకు 10శాతం అంటే 3,900 కాంప్లిమెంటరీ టికెట్టు కేటాయించింది ఎస్‌ఆర్‌హెచ్. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కాకపోతే, కార్పొరేట్ బాక్స్ టికెట్ల గురించే గొడవంతా. F 12a అనే కార్పొరేట్ బాక్స్‌ కెపాసిటీ 50 సీట్లు. వీవీఐపీలు, సెలబ్రిటీల నుంచి ఈ పాసుల కోసం బాగా డిమాండ్ ఉంది. అయితే, ఈ ఏడాది ఆ బాక్సులో 30 మంది కూర్చునే ఛాన్స్ మాత్రమే ఉంది. అందుకే, అందులో 10శాతం లెక్క ప్రకారం 3 పాసులను HCAకు ఇచ్చింది SRH. కార్పొరేట్ బాక్స్ టికెట్ల కోసం భారీ లాబీయింగ్ ఉంటుంది. అందుకే, 3 పాసులు సరిపోవని.. కనీసం 20 టికెట్లు అయినా ఇవ్వాలంటూ SRHపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది HCA. కానీ, సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌కు కూడా ఆ బాక్స్ అత్యంత కీలకం. అప్పటికే వాళ్లు ఆ టికెట్లను కార్పొరేట్ పెద్దలకు ఇచ్చేశారు. అందుకే, HCA ఎంత ప్రెజర్ పెట్టినా ఎక్స్‌ట్రాగా ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు.

HCA అంత టార్చర్ ఎందుకు చేసింది?

అడిగినన్ని టికెట్లు ఇవ్వకపోవడంతో అసోసియేషన్ పెద్దలు ఖంగుతిన్నారు. తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మా గ్రౌండ్‌కే వచ్చి మాకే టికెట్లు ఇవ్వరా అంటూ పెత్తనం ప్రదర్శించారు. ఇటీవల జరిగిన మ్యాచ్‌కు F 3 అనే బాక్సుకు తాళాలు వేశారు. అప్పటికే టికెట్లు కేటాయించిన ఈ బాక్సులోకి ఎవరూ అడుగుపెట్టకుండా కట్టడి చేశారు. ఇలా బాక్సులోకి ఎవరూ వెళ్లకుండా లాక్ చేయడాన్ని SRH సైతం సీరియస్‌గా తీసుకుంది. HCA చేసిన పనిని తప్పుబడుతూ.. అసోసియేషన్ బెదిరింపులకు తీవ్ర ఆందోళన చెందినట్టు సన్‌రైజర్స్ ప్రతినిధి ఓ లేఖ రాశారు. అది కాస్త లీక్ అయింది. సోషల్ మీడియాకు ఎక్కి రచ్చ అవుతోంది.

సీఎం ఆదేశాలతో సూపర్ పోలీస్ ఎంట్రీ

మేటర్ ముఖ్యమంత్రి కార్యాలయంకు చేరింది. సీఎం దృష్టికి రాగానే.. ఇలా టికెట్ల కోసం చిల్లర గొడవలేంటంటూ అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. సన్‌రైజర్స్‌ను HCA ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవమా కాదా తేల్చాలంటూ విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. విచారణ బాధ్యతను విజిలెన్స్ హెడ్‌ ఉన్న కొత్తకోట శ్రీనివాసరెడ్డికి అప్పగించారు.  DGP ర్యాంక్ అధికారి అయిన కొత్తకోట ఒకసారి రంగంలోకి దిగితే.. ఇక ఆయన మాట ఆయనే వినరు. గతంలో హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడు.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న సిబ్బంది అందరినీ ఒకేసారి బదిలీ చేసిన ఖతర్నాక్ చరిత్ర ఆయనది. వన్స్ కొత్తకోట స్టెప్ ఇన్.. ఇక నో కాంప్రమైజ్.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×