BigTV English

Kalyan Ram: బింబిసార సీక్వెల్‌ వచ్చేస్తుంది.. కళ్యాణ్ రామ్ ఏం అప్డేట్ ఇచ్చాడంటే..?

Kalyan Ram: బింబిసార సీక్వెల్‌ వచ్చేస్తుంది.. కళ్యాణ్ రామ్ ఏం అప్డేట్ ఇచ్చాడంటే..?

Kalyan Ram:నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కళ్యాణ్ రామ్ (Kalyan Ram) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన తాత దివంగత నటులు, రాజకీయ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (NTR ) మనవడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరొకవైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో విజయశాంతి(Vijayashanti )కీ రోల్ పోషిస్తోంది. భారీ అంచనాల మధ్య త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా నుండి సాంగ్ రిలీజ్ చేయగా సాంగ్ రిలీజ్ సందర్భంగా ఈవెంట్ ను నిర్వహించారు.


త్వరలో బింబిసార సీక్వెల్ వస్తుంది – కళ్యాణ్ రామ్

ఈ ఈవెంట్ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. బింబిసార సీక్వెల్ పై క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఆనందంతో ఈవెంట్ ప్రాంగణాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ ఈవెంట్ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ..” పటాస్ సక్సెస్ మీట్ తర్వాత ఎప్పుడూ కూడా నేను ఇలాంటి బహిర్గత ఈవెంట్ కు హాజరు కాలేదు. కానీ ఇప్పుడు సాంగ్ రిలీజ్ ఈవెంట్ కి రావడంతో అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ సక్సెస్ మీట్ కి వచ్చినట్టు ఉంది” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈవెంట్ కు హాజరైన అభిమానులందరికీ ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన కళ్యాణ్ రామ్.. అభిమానుల కోరిక మేరకు బింబిసారా సీక్వెల్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. అభిమానులు బింబిసార సీక్వెల్ పై అప్డేట్ ఇవ్వాలని కోరగా.. “త్వరలోనే బింబిసార 2 వస్తుంది.. కంగారు పడకండి.. ముందు అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ చూడండి” అంటూ అభిమానులకు భారీ ఊరట కలిగించారు. మొత్తానికైతే బింబిసార 2 తో కళ్యాణ్ రామ్ మరెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. ఇకపోతే అంతా బాగానే ఉంది కానీ.. డైరెక్టర్ వశిష్ట తో విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. మరి ఈ సీక్వెల్ ను ఎవరు తెరకెక్కిస్తారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి


Anchor Shiva Jyothi : అక్రమంగా రూ.10 కోట్లు… చిట్టా మొత్తం బయటపెట్టిన నా అన్వేషణ..!

బింబిసారా సినిమాతో భారీ ఇమేజ్..

ఇక బింబిసారా విషయానికి వస్తే.. క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతి అయిన బింబిసారుడి కథ నేపథ్యంలో ఈ సినిమాను నిర్మించారు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకి వశిష్ట మల్లిడి (Vassista mallidi) దర్శకత్వం వహించారు. కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, కేథరిన్, వారినా హుస్సేన్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా 2022 ఆగస్టు 5వ తేదీన విడుదలై మంచి విజయాన్ని అందించింది. ముఖ్యంగా సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూసిన కళ్యాణ్ రామ్ కి ఈ సినిమా భారీ ఊరట కలిగించింది అని చెప్పవచ్చు. అప్పటివరకు సక్సెస్ కోసం ఎదురుచూసిన కళ్యాణ్ రామ్ దెబ్బతో స్టార్ సెలబ్రిటీ అయిపోయారని చెప్పాలి. అయితే ఈ సినిమాల తర్వాత రెండు మూడు చిత్రాలు చేసిన పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోని ఈసారి భారీ అంచనాలతో ఏకంగా లేడీ అమితాబ్ విజయశాంతిని తన సినిమాలో భాగం చేస్తూ అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా కళ్యాణ్ రామ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×