BigTV English
Advertisement

CM Revanth Reddy: కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం పెంచాం- సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం పెంచాం- సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆర్థిక ఇబ్బందులతో పిల్లలను తల్లిదండ్రులు హాస్టళ్లలో చేరుస్తున్నారని, విద్యార్థుల మృతిపై మనం ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ప్రతినెల 10వ తేదీ లోపు గ్రీన్‌‌ఛానల్‌ ద్వారా అన్ని విద్యాసంస్థలకు నిధులు వస్తాయిని తెలిపారు.


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కామన్ డైట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. చిరుకూరిలోని గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గురుకులాలు అంటే.. బహుముఖ ప్రతిభకు కేంద్రాలు అనే గుర్తింపు తీసుకురావాలని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలు, హాస్టల్స్ లలో ఒకే విధంగా మెనూ తయారు చేస్తున్నారని ఆయన అన్నారు.

గురుకులాలు వ్యవస్థ అనేది పీవీ నరిసింహ రావు హయాంలో తీసుకొచ్చారని సీఎం గుర్తు చేశారు. ఈమధ్యనే డైట్ ఛార్జీలు పెంచామన్నారు. పాఠశాలలో విద్యార్ధుల ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలు బాగున్నాయని ఆయన తెలిపారు. గురుకులాల్లో విద్యార్ధులకు సరికొత్త డైట్ ప్లాన్ చేస్తామన్నారు. తెలంగాణలోని సంక్షేమ, గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన మౌళిక సదుపాయాలు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.


Also Read:  తెలంగాణలో మొదలైన ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల సర్వే, డిసెంబర్ 31 నాటికి..

గురుకులాల నుంచి ఎందరో ఐఏఎస్, ఐపీఎస్‌లు వచ్చారని గుర్తు చేశారు. సంక్షేమ హాస్టళ్లల్లోని విద్యార్థుల కోసం డైట్, కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం పెంచామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 26 వేల ప్రభుత్వ స్కూళ్లలో 23 లక్షల మంది విద్యార్థులుంటే.. 11 వేల ప్రైవేట్ స్కూళ్లలో 33 లక్షల విద్యార్థులు ఎలా చదువుకుంటున్నారని ఆయన ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఏ విషయంలో వెనుకబడ్డామో ఉపాధ్యాయులు ఆలోచించాలని సీఎం రేవంత్ సూచించారు.

గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన మౌళిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం సైతం గురుకులాల్లోనే చదువుకున్నారని గుర్తు చేశారు. గతంలో ప్రభుత్వాలు గురుకులాలకు ప్రాధాన్యతనిచ్చాయి. తర్వాత వచ్చిన గవర్నమెంట్లు వాటిని చిన్నచూపు చూశాయని, త్వరలో మార్పులు తీసుకొస్తామన్నారు.

Related News

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Jubilee Hills By Elections: మాగంటి తల్లి ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: మంత్రి సీతక్క

Jubilee Hills: మాగంటి డెత్ మిస్ట‌రీ.. జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ చీప్ పాలిటిక్స్.. మరీ ఇంత దిగజారాలా..?

Jubilee Hills bypoll: జూబీహిల్స్‌ బైపోల్‌లో సైలెంట్ వేవ్ రాబోతుంది.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Cyber Crime Hyderabad: సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్.. ఒక్క నెలలో 55 మంది అరెస్ట్

Big Stories

×