Shakib AL Hasan: తరచూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షాకీబ్ అల్ హసన్ {Shakib AL Hasan} గురించి క్రీడాభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇతను ప్రపంచ క్రికెట్ లో మేటి ఆల్ రౌండర్. షకీబ్ అల్ హసన్ తన ఆటతో ఎంత పేరు సంపాదించుకున్నాడో.. ఇతర వ్యవహారాలలోనూ అంతే ఫేమస్ అయ్యాడు. తరచూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతుంటాడు షకీబ్. గతంలో ఎన్నోసార్లు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన షాకీబ్ అల్ హసన్ {Shakib AL Hasan}.. ఇప్పుడు మరోసారి అలాంటి చేష్టలతోనే వార్తల్లోకి వచ్చాడు.
Also Read: World Chess Champion Gukesh: గుకేష్ తెలుగోడు కాదు…చంద్రబాబు వర్సెస్ స్టాలిన్ ?
షకీబ్ అల్ హసన్ {Shakib AL Hasan} పై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వేటు వేసింది. అతను తమ దేశంలో జరిగే పోటీలలో బౌలింగ్ చేయకుండా నిషేధం విధించింది. దీంతో ఈబీసీ నిర్వహించే పోటీలలో అతడు ఇకనుండి బౌలింగ్ చేయకూడదు. ఇందుకు కారణం ఏంటంటే.. ఈ ఏడాది సెప్టెంబర్ లో కౌంటీ ఛాంపియన్షిప్ లో సర్రే తరఫున బరిలోకి దిగాడు షకీబ్. అయితే ఓ మ్యాచ్ లో బౌలింగ్ యాక్షన్ పై ఫీల్డ్ ఎంపైర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో విచారణ చేపట్టిన ఈబీసీ షకీబ్ బౌలింగ్ చేయకుండా నిషేధం విధించింది.
సోమర్ సెట్ తో జరిగిన పోరులో షాకీబ్ 9 వికెట్లు పడగొట్టాడు. ఇకనుంచి ఈసీబీ పోటీల్లో అతడు బౌలింగ్ చేయడానికి వీలులేదని ఈసీబీ వెల్లడించింది. బౌలింగ్ యాక్షన్ కి సంబంధించి స్వతంత్ర విచారణలో ఇల్లీగల్ అని తేలిందని, షకీబ్ అల్ హసన్ బౌలింగ్ యాక్షన్ పై ఎంపైర్ నుంచి ఫిర్యాదులు రావడంతో అతని బౌలింగ్ యాక్షన్ ని పరీక్షించి అతనిపై వేటు వేశామని ఈబీసీ వెల్లడించింది. షకీబ్ మోచేయి 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంగుతున్నట్లు ఫలితాలలో తేలినట్లు ఈబిసి పేర్కొంది.
Also Read: Vinod Kambli: పెన్షన్ డబ్బులతో బతుకీడుస్తున్న భారత మాజీ క్రికెటర్!
ఇక షాకీబ్ {Shakib AL Hasan} 2007లో భారత్ పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. టి – 20 అంతర్జాతీయ క్రికెట్ లో అతడు బంగ్లాదేశ్ తరఫున 129 మ్యాచ్ లు ఆడాడు. 126 ఇన్నింగ్స్ లలో షకీబ్ మొత్తం 2551 పరుగులు చేశాడు. ఇందులో 16 సార్లు నాటౌట్ గా నిలిచాడు. షకీబ్ అత్యుత్తమ స్కోరు 84 పరుగులు. సగటు 23.19. అతను 13 హాఫ్ సెంచరీలతో సహా 121.25 స్ట్రైక్ రేటుతో పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ లో షకీబ్ 149 వికెట్లు తీశాడు. అలాగే టెస్ట్ క్రికెట్లో షాకీబ్ 70 మ్యాచ్ లలో 242 వికెట్లు పడగొట్టాడు. బ్యాట్స్మెన్ గా అతను టెస్ట్ క్రికెట్ లో 5 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో సహా 4600 పరుగులు చేశాడు. అంతే కాదు అతనికి ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. ఇక షకీబ్ అల్ హసన్ పై ఈబీసీ విధించిన నిషేధం డిసెంబర్ 10 నుండి అమలులోకి వచ్చింది.