Pahalgam: కాశ్మీర్ లోని పహల్గామ్ లో ( Pahalgam) ఉగ్రదాడి ( Terrorists Kill ) జరిగి ఏడాది కాలం పూర్తయింది. ఈ మారణకాండ నేపథ్యంలో ఏకంగా 26 మంది దుర్మరణం చెందారు. ఇందులో విదేశీ యాత్రికలు కూడా ఉండడం విషాదకరం. అయితే ఈ సంఘటన రెండు దేశాల మధ్య చీలిక తెచ్చిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గొడవలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ పహల్గామ్ సంఘటనతో ఈ ఘర్షణలు మరింత పెరిగాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో పహల్గామ్ సంఘటన స్థలంలోనే పాకిస్తాన్ క్రికెటర్ల జెర్సీ లు, టీషర్ట్స్ కలకలం రేపాయి.
పహల్గామ్ లో ( Pahalgam) ఉన్న కొంత మంది దుకాణపు దారులు… బాబర్ ఆజం లాంటి పాకిస్తాన్ క్రికెటర్ల జెర్సీలు, టీ షర్టులను విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబర్ ఆజం ( Babar Azam T-shirts), ఇతర పాకిస్తాన్ క్రికెటర్ల టీ- షర్ట్స్ వైరల్ గా మారాయి. ఇది చూసిన ఇండియన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 26 మందిని పొట్టన పెట్టుకున్న దేశ క్రికెటర్ల టీ షర్ట్ లను ఇండియాలో ఎలా అమ్ముతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంచెమైనా బుద్ధి ఉందా? వెంటనే ఆ జెర్సీలు , టీషర్ట్స్ దగ్ధం చేయాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
26 మందిని పహల్గామ్ ( Pahalgam Incident) ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన సరిగ్గా ఏడాది కిందట జరిగింది. ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టు పెట్టింది మోడీ సర్కార్. ఆపరేషన్ సిందూర్ పేరుతో దాదాపు నెల రోజులు పాకిస్తాన్ తో యుద్ధం చేసింది ఇండియన్ ఆర్మీ. ఈ క్రమంలో వంద మంది ఉగ్రవాదులను కూడా మట్టి కరిపించింది. ఇంత జరిగినా కూడా పహల్గామ్ ప్రాంతంలో ఉన్న కొంత మంది దుకాణపు దారులు… పాకిస్తాన్ క్రికెటర్ల జెర్సీలు, టీ షర్ట్స్ అమ్మడంపై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పహల్గామ్ ప్రాంతంలో ఇకపైన హిందువులు ( Hindus) పర్యటించకూడదని కొంత మంది పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ వివాదం కాశ్మీర్ పర్యాటక రంగంపై ప్రభావం చూపుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా పాకిస్తాన్ క్రికెటర్ల టి షర్ట్స్ అమ్మడం అత్యంత దారుణం అంటూ మండిపడుతున్నారు. ఇలా టీ షర్ట్స్ అమ్మిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని మోడీ సర్కార్ ను డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ టీషర్ట్ ల వివాదం పైన ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి లేదా స్థానిక అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వీడియోలు, ఫోటోలు మాత్రం వైరల్ అయ్యాయి. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ అయింది.