CM Revanth – Komatireddy: ఎట్టకేలకు ఏడాది తర్వాత హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఫిబ్రవరిలో టెండర్ల ప్రక్రియ మొదలుకానుంది. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని అభినందించారు సీఎం రేవంత్‌రెడ్డి.
మీ కృషి సహకారంతో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పట్టాలెక్కిందన్నారు ముఖ్యమంత్రి. 2017లో ఆగిపోయిన ప్రాజెక్టు మీ సహకారంతో కేవలం ఏడాదిలో సాధ్యమైందని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు మంజూరు చేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి కోమటిరెడ్డి.
161 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టును 5 ప్యాకేజీలు విభజించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం 7, 104 కోట్ల రూపాయలు. వచ్చేఏడాది ఫిబ్రవరి 15న బిడ్ దాఖలు చేసుకోవచ్చు. రెండు రోజుల తర్వాత వాటిని తెరవడం, ఆపై ఆమోదించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక, సాంకేతిక విభాగాల్లో ఈ బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
రహదారుల నిర్మాణంలో ఇంజనీరింగ్ పనులు, సామాగ్రి సేకరణ, వ్యయం అన్నీ గుత్తేదారు సంస్థ చూసుకోవాల్సి ఉంటుంది. ఓఆర్ఆర్ ఉత్తర వైపు రహదారి నిర్మాణానికి 1940 హెక్టార్ల భూములు అవసరం కానున్నాయి. ఇప్పటికే 94 శాతం పూర్తి అయ్యింది. నిర్మాణానికి వెచ్చించిన నిధులు 17 ఏళ్లలో టోల్ రూపంలో వసూలు కానున్నట్లు ఓ అంచనా.
ALSO READ: శాసనసభ ప్రత్యేక సమావేశం, ఏర్పాట్ల పరిశీలనలో స్పీకర్
ఓఆర్ఆర్‌పై గంటలకు 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా నిర్మించనున్నారు. మొత్తం 11 ఇంటర్ ఛేంజ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. 187 అండర్ పాసులు, నాలుగు ఆర్వోబీలు, 26 పెద్ద వంతెనలు, 81 చిన్న వంతెనలు, 400 పైగానే కల్వర్లులు నిర్మించాల్సి ఉంటుంది.
మంత్రి కోమటిరెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం టెండర్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మంత్రికి ఫోన్ చేసి అభినందించిన ముఖ్యమంత్రి
మీ కృషి, మీ సహకారం, మీ సలహాతోనే ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పట్టాలెక్కిందన్న ముఖ్యమంత్రి
2017లో ఆగిపోయిన ప్రాజెక్టు మీ అనితర… pic.twitter.com/dqFmXfpN11
— BIG TV Breaking News (@bigtvtelugu) December 29, 2024