E-Paper
Advertisement

Hyderabad: టార్గెట్ 100 యూనికార్న్.. గూగుల్ ఫర్ స్టార్టప్స్ కేంద్రం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad: టార్గెట్ 100 యూనికార్న్.. గూగుల్ ఫర్ స్టార్టప్స్ కేంద్రం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

Hyderabad: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ స్టార్టప్‌లపైనే  కాకుండా యూనికార్న్ సంస్థలపై దృష్టి సారించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నుంచి కనీసం 100 యూనికార్న్ సంస్థలు రావాలని మనసులోని మాట బయటపెట్టారు. టీ హబ్‌లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. 

గూగుల్ ఫర్ స్టార్టప్స్ కేంద్రం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

Advertisement

1998లో గూగుల ప్రస్థానం కూడా ఒక స్టార్టప్ మాదిరిగా మొదలైందన్నారు ముఖ్యమంత్రి. గూగుల్ విజయ ప్రస్థానం మాకు నిత్యం స్ఫూర్తిదాయకమన్నారు. గూగుల్, యాపిల్, అమెజాన్, టెస్లా, వంటి గొప్ప స్టార్టప్‌లు వచ్చాయన్నారు.  హైదరాబాద్‌లో ఉన్న అగ్రస్థాయి స్టార్టప్స్‌లో గూగుల్ ఒకటన్నారు.

మీరు యువకులు, శక్తివంతులు.. సాధారణంగా మీరు మీ కలలను సాకారం చేసుకోవాలన్నారు.  ఈ సందర్భంగా మీకు స్పూర్తిని కలిగించే ఓ విషయాన్ని చెప్పారు. ఉన్నత ఆశయాలతో 1998లో ఇద్దరు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ మిత్రులు కలిసి కాలిఫోర్నియాలోని ఓ గారేజీలో ఓ స్టార్టప్‌ని ప్రారంభించారని తెలిపారు. అది ఇవాళ ప్రఖ్యాత గూగుల్ కంపెనీగా అవతరించిందన్నారు.

Advertisement

టార్గెట్ 100 యూనికార్న్ సంస్థలు-సీఎం రేవంత్

తెలంగాణ భవిష్యత్ అభివృద్దిని ఆకాంక్షించి ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్‌ను పరిచయం చేయాలన్నారు. గడిచిన రెండు రోజులు తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించామన్నారు. జాతీయ-అంతర్జాతీయ కార్పోరేట్ల సమక్షంలో తెలంగాణ భవిష్యత్ కోసం మన విజన్‌ను ఆవిష్కరించామన్నారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఉండాలన్నారు.

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. 20 ఏళ్ల కిందట ప్రారంభించిన అనేక స్టార్టప్స్ ఇవాళ బిలియన్ల డాలర్ల కంపెనీలుగా ఎదిగాయన్నారు. అందుకు గూగుల్, ఆపిల్, అమెజాన్, టెస్లా, ఫేస్‌బుక్ కంపెనీలు ఉదాహరణలుగా ఉన్నాయన్నారు.

25 సంవత్సరాల్లో సాఫ్ట్‌వేర్ సర్వీసెస్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్‌లో చాలా స్టార్టప్స్..  పెద్ద కంపెనీలుగా ఎదిగాయని గుర్తు చేశారు. తెలంగాణ రైజింగ్ విజన్ స్టార్టప్స్ కోసం మీ ప్రణాళికలు ఏంటని అడిగితే, స్టార్టప్‌ని ఫుట్‌బాల్ ఆటతో పోల్చుతానన్నారు. తాను ఆట ఆడతాని, అందుకు సమిష్టి కృషి అవసరమన్నారు. పట్టుదలతో సాధన చేయాలని, ఇది టీమ్ వర్క్ అని అన్నారు. 

ALSO READ: జీహెచ్ఎంసీలో వార్డుల పెంపు.. వారం రోజుల గడువు

చివరకు గెలుపు చాలా ముఖ్యమన్నారు. స్టార్టప్స్ కూడా అదే విధంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో మంచి ఎకో సిస్టమ్‌ను సృష్టించాలనుకుంటున్నామి, తెలంగాణ ప్రభుత్వం-గూగుల్ మీకు అవసరమైన సహకారం అందించడానికి సిద్దంగా ఉన్నాయన్నారు. స్టార్టప్ ల కోసం ప్రభుత్వం రూ. 1000 కోట్లతో స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేస్తుందని దాన్ని వినియోగించుకోవాలన్నారు. తద్వారా స్టార్టప్‌లు గూగుల్ స్థాయిలో లేదా 1 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదగాలని కోరుకుంటున్నామని తెలియజేశారు సీఎం రేవంత్‌రెడ్డి.

అంతకుముందు మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చి రెండేళ్ల అయిన సందర్భంగా ఈ కేంద్రం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇదో కొత్త ప్రారంభమని, అలాగే కొత్త ప్రయాణమన్నారు. స్టార్టప్స్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే మా స్టార్టప్ లకు గూగుల్ మెంటార్‌గా ఉండడం చాలా సంతోషమన్నారు.

ఇప్పుడు యూనికార్న్ సంస్థలు ఏర్పాటు చేసే అవకాశం వచ్చిందన్నారు. యూనికార్న్‌లను తయారు చేయడం కోసం ఈ కేంద్రం ఉందన్నారు. 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పెట్టుకోవడంపై విమర్శలు వచ్చాయని గుర్తు చేశారు. లక్ష్యమంటూ ఉంటేనే ప్రగతి పథంలో దూసుకెళ్లగమన్నారు.

కొత్త కొత్త టెక్నాలజీలను అంది పుచ్చుకోవాలన్నారు. దేశంలోని మొదటి ప్రైవేటు రాకెట్ హైదరాబాద్ లో తయారైందన్నారు. టీ-హబ్ కు గూగుల్ ను రప్పించడానికి చాలా శ్రమించామన్నారు. ఇది దేశంలోనే మొట్ట మొదటి గూగుల్ స్టార్టప్స్ కేంద్రమన్నారు. ప్రపంచంలో ఐదో గూగుల్ స్టార్టప్స్ కేంద్రమని వివరించారు.

 

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×