CM Security : వేములవాడలో రాజన్న సన్నిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అక్కడ తనదైన శైలిలో రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం హోదాలో తొలిసారి వేములవాడ దర్శనం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి పర్యాటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పకడ్భందీగా చేసారు. అయితే.. తిరుగు ప్రయాణంలో మాత్రం కాస్త ఆందోళకర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొన్ని నిముషాల్లో సీఎం బయలుదేరతారు అనుకున్న సమయంలో భద్రతా సిబ్బందికి ముచ్చెమటలు పట్టే ఘటన జరిగింది. భద్రతా సిబ్బంది అంతా అలెర్ట్ అయ్యారు.
సాధారణంగానే సీఎం ప్రోటోకాల్ చాలా పకడ్భందీగా ఉంటుంది. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఎలాంటి పొరబాట్లకు అవకాశం ఉన్నా.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే.. భద్రతా అధికారులు కళ్లార్పకుండా కనిపెట్టుకుని కూర్చుంటారు. అయినా.. ఒక్కోసారి అనుకోని ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అలాంటిదే.. వేములవాడ సన్నిధిలో జరిగింది.
సభ ముగించుకుని తిరుగు ప్రయాణమైన సీఎం రేవంత్ రెడ్డి.. తన హెలీకాఫ్టర్ లో వచ్చి కూర్చున్నారు. ఆయనతో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరికొందరు హెలికాప్టర్ లో కూర్చున్నారు. ఇక మరికాసేపట్లో హెలీకాఫ్టర్ గాలిలోకి లేస్తుంది. అప్పటి వరకు సీఎం భద్రతకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగగా, అప్పుడే అక్కడికి వచ్చిన ఓ కుక్క అధికారుల్ని పరుగులు పెట్టించింది. హెలీకాఫ్టర్ గాలిలోకి లేచే సమయంలో దాని దగ్గరకు వెళ్లి పచార్లు కొట్టింది. దాంతో.. భద్రతా అధికారులు దాన్ని అక్కడి నుంచి పంపేంచేందుకు ప్రయత్నించారు.
Also Read : ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. ఘటనపై సీఎం సీరియస్.. కలెక్టర్ కు ఫోన్ చేసి కీలక ఆదేశాలు
హెలీకాఫ్టర్ గాలిలోకి లేచే ముందు ఇలాంటి వాటిని అంగీకరించరు. దాంతో.. సీఎం ప్రోటోకాల్ సిబ్బంది నుంచి స్థానిక పోలీసుల వరకు ఏం జరుగుతుందోనన ఆందోళన పడ్డారు. ఆ కుక్క.. హెలీకాఫ్టర్ కు మరింత దగ్గరగా వెళితే, ప్రయాణాన్ని కాస్త వాయిదా వేయాల్సి వచ్చేది. కానీ.. కొంచెం సేపు మాత్రమే అక్కడ తిరిగిన కుక్క.. వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్లిపోయింది. దాంతో.. సీఎం భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినందుకు సంతోషించారు.