Intinti Ramayanam Today Episode November 21th : నిన్నటి ఎపిసోడ్ లో.. రాత్రి వినోద్, ప్రణవి, కమల్ అందరు కలిసి రాజేంద్ర ప్రసాద్ కు నిజం తెలియనివ్వొద్దు అని అనుకుంటారు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అక్కడ వస్తాడు. అందరు మౌనంగా ఉండటంతో ఏమైందని అడుగుతారు. పల్లవి నోరు జారుతుంది. రాజేంద్రప్రసాద్ మాత్రం ఎందుకు అందరూ హాల్లోనే ఉన్నారు ఏం జరిగింది? ఏం చేశారు అని అడుగుతాడు. మిమ్మల్ని చూసి రెండు రోజులు అయింది కదా మామయ్య అందుకే అందరూ ఇక్కడ ఉన్నాము మీకోసమే ఎదురు చూస్తున్నాము వెళ్లిన పని సక్సెస్ అయ్యిందా అని వినోద్ అడుగుతాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ నిన్ను నెత్తిన పెట్టుకుంటున్నారు నీ గురించి నిజం తెలిస్తే మామయ్య ఎలా రియాక్ట్ అవుతారో ఊహించలేం అక్క అని వెళ్ళిపోతుంది. ఇంతగా మోసం చేస్తున్నాను మా అమ్మ తమ్ముడు గురించి నిజం చెప్తే ఈ టెన్షన్స్ నాకు ఉండేవి కాదు కదా అని అవని ఆలోచిస్తుంటుంది. ఇక పల్లవి నీ గురించి ఎలాగైనా నిజాన్ని మామయ్యకి చెప్తానని మనసులో అనుకుంటుంది. రాత్రి అందరూ భోజనానికి డైనింగ్ హాల్ దగ్గరికి వస్తారు. ఆరాధ్య ఎక్కడ అవని అని అవని అడుగుతాడు రాజేంద్రప్రసాద్. దానికి అవని అన్నం తినిపించి పడుకోపెట్టాను మావయ్య అనేసి అంటుంది. పల్లవి గొంతు మార్చి అవని గురించి నిజం చెప్తుంది. భరత్ అనే ఆ వ్యక్తిని మీ కోడలు పోలీస్ స్టేషన్ నుంచి విడిపించిందని మీకు తెలుసా ఇది ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళు అందరూ దాచి పెట్టారు అసలు విషయం ఏంటో మీ కోడల్ని అడిగి తెలుసుకోండి అని రాజేంద్రప్రసాద్ అంటాడు. ఆ మాట వినగానే రాజేంద్రప్రసాద్ కోపంతో అవని మీద చిందులు వేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాజేంద్ర ప్రసాద్ అవని పై సీరియస్ అవుతాడు. నా ఇంట్లో నా మాట వినకుండా ఉంటే అవసరం లేదు. నా పెద్దరికంకు ఇచ్చే మర్యాద ఇదేనా అని నానా రచ్చ చేస్తాడు. నాకు తప్పు చేసిన నా నిర్ణయాన్ని దిక్కరించిన నాకు నచ్చదు అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు. ఇక కోపంగా నా కూతుర్ని ఏడిపించారని ఆ వెధవల్ని నేను పోలీసులు అప్పగిస్తే అవని వాళ్ళ వాడిని విడిపించింది. నేనంటే ఎంత విలువిస్తుందో నాకు అర్థమైంది రే అక్షయ్ నీ భార్యని ఏం చేయమంటావో చెప్పు అనేసి రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. మీరు ఏం చేసినా నాకు ఓకే నాన్న మీ నిర్ణయాన్ని నేను అడ్డు చెప్పనా అనేసి అంటాడు. ఇప్పటినుంచి నీకు 24 గంటలే టైం ఇస్తున్నాను. 25వ గంటతో నీకు ఇంటికి ఎటువంటి సంబంధం లేదు అనేసి రాజేంద్రప్రసాద్ కండిషన్ పెడతాడు.. నువ్వు ఇంటిని వదిలేసి వెళ్లిపోవాలని రాజేంద్రప్రసాద్ అవినీతి వార్నింగ్ ఇస్తాడు.
ఇక ఉదయం లేవగానే అవని తన తల్లి దగ్గరికి భోజనం తీసుకొని వెళ్తుంది. మీనాక్షి నీకెందుకు అమ్మ ఈ శ్రమ భరత్ ఉన్నాడు కదా ఏదో ఒకటి తీసుకొచ్చేవాడు కదా రోజు ఇలా వస్తే ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారు కదా అనేసి అంటుంది. అవునక్కా నేనే ఇప్పుడే అమ్మకి ఏదైనా తినడానికి తీసుకొని వస్తాను అని అడుగుదాం అనుకున్నాను అంతలోకే నువ్వు వచ్చావు అని అంటాడు. అమ్మ కన్నా ఎక్కువ శ్రమ ఉంటుంది అని అవని అంటుంది. అవని ప్రేమగా మీనాక్షికి అన్నం తినిపిస్తుంటే మీనాక్షి ఏడుస్తుంది. ఏమైందమ్మా ఎందుకే ఆ కన్నీళ్లు అంటే నా కూతురు నా మీద చూపిస్తున్న ప్రేమకు ఉప్పొంగి వస్తున్న నీళ్లమ్మ అవి అనేసి అంటుంది. ఇక హాస్పిటల్ లో ఉన్న ఆయా భరత్ ను నా ఫోన్ తీసావా అని అడుగుతుంది. ఏదో మీ అక్క చెప్పింది కదా అని నా రూమ్ లో ఉండనిస్తే నువ్వు ఫోన్ తీసుకుంటావని ఆయమ్మ అడుగుతుంది. అప్పుడు సిస్టర్ అబ్బాయి నీ ఫోన్ తీసుకోలేదు. అక్కడున్న సిస్టర్ నువ్వు రూమ్ లో ఫోన్ మర్చిపోతే నేనే రిసెప్షన్ లో పెట్టానని అంటుంది. భరత్ ను ఆమె రూమ్ లో నువ్వు ఉండటం మల్లే నీ మీద నిందలు వేస్తుంది నువ్వు వేరే రూమ్ చూసుకోవడం మంచిదే అని సలహా ఇస్తుంది సిస్టర్.
ఇక భరత్ తో మాట్లాడాలని అవని బయటకు తీసుకెళుతుంది. నువ్వు గుడికొచ్చినప్పుడు ఆ వ్యక్తుల్ని గుర్తుపడతావా అని అవని అడుగుతుంది. భరత్ వాళ్ళ మొహాలు నాకు సరిగా గుర్తుకు లేవు అక్క. ఒక ఆవిడ గుడికి పిలిచింది నేను అందుకే వచ్చాను అని అంటాడు. ఆవిడ ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర ఉంది ఇదిగో ఆవిడ ఫోన్ నెంబర్ అని ఇస్తాడు. కానీ ఆ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. ఇక అప్పుడే అవనికి ఫోన్ వస్తుంది. ఎస్సై ఫోన్ చేసి మీతో మాట్లాడాలి అని చెప్పేసి రమ్మని చెప్తాడు. అవని వస్తానండి అంటుంది. ఇక భరత్ లోపలికి వెళ్లేసి వస్తాను అక్క అని అంటాడు. అమ్మకు ఆక్సిడెంట్ చేసినా ఆవిడ విజిటింగ్ కార్డు ఇచ్చింది. నీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు హాస్పిటల్ లో బిల్లు కట్టడానికి ఈ నెంబర్ కి ఫోన్ చేయమని లేదా అడ్రస్ కి రమ్మని చెప్పిందని ఇస్తాడు. ఇది పల్లవి విస్టింగ్ కార్డు కదా అని అవని అనుకుంటుంది. అవని తన ఫోన్లో ఉన్న పల్లవి ఫోటో చూపిస్తుంది. ఈవిడ నా అమ్మకు ఆక్సిడెంట్ చేసిందని భరత్ ని అడుగుతుంది. అవునక్కా ఈవిడ అనేసి భరత్ అంటాడు.
ఇక ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. పార్వతి ఈయన పెట్టిన గడువులో అవని భరత్ తప్పేమని లేదని నిరూపిస్తుందో లేదో అని అనుకుంటుంది. బామ్మ వేసే సెటైర్లకు కమల్ కౌంటర్లు ఇస్తాడు. వదిన మహారాణి లాంటిది తన తప్పుని నిరూపించుకుంటుంది అనేసి అంటాడు. అప్పుడే అవని అక్కడికి వస్తుంది. అవని ఆ దోషులు ఎవరో తెలిసిందా భరత్ తప్పేం లేదని తెలుసుకున్నావు అని అడుగుతుంది. తెలిసింది అత్తయ్య గుడిలో సీసీ కెమెరాలు ఉన్నాయని ఎస్ఐ నాకు ఫోన్ చేసి చెప్పాడు అక్కడికి వెళ్లి వస్తున్నాను అనేసి అంటుంది. ఆ సీసీ కెమెరాలో ప్రణవి నేర్పించడం వల్ల ఫేసులు ఉంటాయని ఆయన చెప్పడంతో త్వరలోనే వాళ్ళు పట్టుకుంటామని కూడా చెప్పారు అని పార్వతితో అంటుంది. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉందమ్మా అని పార్వతి అంటుంది.. ఇక పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది.
వీళ్ళు దొరికితే నా పేరు బయటకు వస్తుందని వాళ్ళని దాచాలని అనుకుంటుంది. చక్రధర్ కి ఫోన్ చేసి వాళ్ళని తీసుకుని రమ్మని చెప్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత పోలీసులు సీసీ కెమెరాలను చూశారు మిమ్మల్ని గుర్తుపట్టారు మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది మీరు వాళ్ళకి కనిపించకుండా కొద్ది రోజులు ఇక్కడే ఉండండి అనేసి పల్లవి ఉంటుంది. చక్రధర్ కూడా మీరు ఇంట్లో ఉండండి మీకు కావలసిన అన్ని ఏర్పాట్లు నేను చేస్తానని అంటాడు. ఇక పార్వతి మామయ్య పెట్టిన గడువు పూర్తవుతుందమ్మా గురించి నీకు ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది. తెలియలేదు అత్తయ్య అనేసి అంటుంది. అప్పుడే రాజేంద్రప్రసాద్ కిందకు వస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో అవని ఇంట్లోంచి బయటకు వెళ్తుందా చూడాలి..