BigTV English
Advertisement

Assembly: లండన్ తరహాలో హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

Assembly: లండన్ తరహాలో హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం అసెంబ్లీలో రాజధాని నగరం హైదరాబాద్ అభివృద్ధిపై మాట్లాడారు. హైదరాబాద్ నగరాన్ని లండన్ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత.. తాము నాలుగో నగరంగా ముచ్చెర్లను అభివృద్ధి చేస్తామని వివరించారు. త్వరలోనే కొత్త ఉస్మానియా భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. పాత ఉస్మానియా హాస్పిటల్ భవనాన్ని వారసత్వ సంపదగా ఉంచుతామని వివరించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం మెగా ప్లాన్ 2050ని సిద్ధం చేశామని తెలిపారు. దుర్గం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జీ కట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ప్రాంతాల్లో బ్రిడ్జీ కట్టలేదని ఒవైసీ అన్నారని, తాము ఇందుకు సంబంధించి ఇది వరకే ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం చెప్పారు. మీర్ ఆలాం చెరువుపై ప్రపంచంలోనే ది బెస్ట్ బ్రిడ్జీల్లో ఒకదాని విధంగా సస్పెన్షన్ బ్రిడ్జీ నిర్మిస్తామని వెల్లడించారు. అలాగే.. లండన్‌లో ఉన్న లండన్ ఐ తరహా.. హైదరాబాద్ ఐని ఈ చెరువుపై నిర్మిస్తామని వివరించారు. దీని ద్వారా నగరం సోయగాలను చూడొచ్చని తెలిపారు.


మూసీ పరివాహక ప్రాంతాన్ని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తామని, ఇందుకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తున్నామని సీఎం తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 10,800 ఇళ్లు కట్టుకుని జీవిస్తున్నారని చెప్పారు. ఆక్రమణదారులను ఆదుకుంటామని, ప్రైవేటు ఆస్తులు ఉంటే టీడీఆర్ బాండ్లు తీసుకువస్తున్నామని, ఎవరూ నష్టపోకుండా పరిహారం అందిస్తామని వివరించారు. వీరిని ఎలా తొలగించాలనేదానికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. మూసీ ప్రక్షాళనకు కన్సల్టెంట్‌లను తెస్తామని పేర్కొన్నారు.

Also Read:  తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా


రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని అసత్య ప్రచారం చేస్తున్నారని, పెట్టుబడులు రాకుండా కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌ను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరచాలని చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను హైడ్రా కాపాడుతుందని తెలిపారు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్ సీఎం అయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని బీఆర్ఎస్ చేసినట్టుగా చెప్పుకున్నారని విమర్శించారు. మూసీ డెవలప్‌మెంట్‌కు సంబంధించి డీపీఆర్ ఏదని కేటీఆర్ అడుగుతున్నారని గుర్తు చేశారు. అసలు కాళేశ్వరానికి డీపీఆర్ ఉన్నదా? అని ఎదురు ప్రశ్నించారు. పనే మొదలుపెట్టని మూసీ అభివృద్ధికి డీపీఆర్ అడుగుతున్నారని పేర్కొంటూ.. కానీ, మూసీకి కచ్చితంగా డీపీఆర్ ఉంటుందని తెలిపారు. ఎందుకు అధ్యక్షా వీరికి ఈ ఆరాటం అని ప్రశ్నిస్తూ కొన్ని వందల సంవత్సరాలు పాలించిన నిజాం పాలకులు ప్రజాస్వామ్యానికి తలొగ్గి తప్పుకున్నారని, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి ఇప్పుడు ఎందుకు గింజుకుంటున్నదని ప్రశ్నించారు. గజ్వేల్‌కు నీళ్లు ఇచ్చానని గొప్పలు పోయే కేసీఆర్.. ఆ నీటిని కాంగ్రెస్ నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు కాల్వకు బొక్క కొట్టి తెచ్చాడని విమర్శించారు. అలాగే.. కేసీఆర్ చెప్పినట్టుగా తాము 80 వేల పుస్తకాలు చదివామని చెప్పలేదని చురకలంటించారు. అందుకే కదా.. ఆ మేడిగడ్డ వారు అధికారంలో ఉన్నప్పుడూ కుంగిపోయిందన్నారు.

Related News

Flying Squad Raids: కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా నగదు..? జూబ్లీ హిల్స్‌లో ఈసీ రైడ్స్

CM Revanth Reddy: సీఎం రేవంత్ పుట్టినరోజు.. PM నుండి CM వరకు శుభాకాంక్షలు

Jubilee Hills By Elections: ఫైనల్‌ స్టేజ్‌కు జూబ్లీహిల్స్‌ బైపోల్‌ క్యాంపెయినింగ్‌.. రేపు సాయంత్రానికి ప్రచారం క్లోజ్‌

Sridhar Babu: యూట పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ హోరు.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్!

Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Big Stories

×