BigTV English

Assembly adjourned sine die: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

Assembly adjourned sine die: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

Assembly adjourned sine die: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 9 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. ఈ సమావేశాల్లో పలు అంశాలపై సభలో వాడీవేడిగా చర్చ జరిగింది. 65 గంటల 30 నిమిషాలపాటు సమావేశాలు జరిగాయి. 5 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. దాదాపు 32 ప్రశ్నలపై సుదీర్ఘంగా చర్చ జరుగగా రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్ 2024-25ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ రూ. 2,91,191 కోట్లతో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.


Also Read: లండన్ తరహాలో హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

ఇదిలా ఉంటే.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రేపు (శనివారం) ఉదయం 4 గంటలకు బయలుదేరి వెళ్లనున్నారని సమాచారం. ఎల్లుండి మంత్రి శ్రీధర్ బాబు, ఈ నెల 5న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బయలుదేరి వెళ్లనున్నారని చెబుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ పలు కంపెనీలను ముఖ్యమంత్రి, మంత్రులు కోరనున్నారని సమాచారం.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×