BigTV English

Hyderabad : న్యూయార్క్, టోక్యో నగరాలతోనే పోటీ.. ఐటీ కారిడార్‌లో PJR ఫ్లైఓవర్

Hyderabad : న్యూయార్క్, టోక్యో నగరాలతోనే పోటీ.. ఐటీ కారిడార్‌లో PJR ఫ్లైఓవర్

Hyderabad : హైదరాబాద్‌కు బెంగళూరు, ముంబై, చెన్నైతో పోటీ కాదని.. న్యూయార్క్, టోక్యో, సింగపూర్‌లతోనే పోటీ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047తో ముందకు వెళుతున్నామని చెప్పారు. ఎంతమైంది రాక్షసులు అడ్డుపడినా అభివృద్ధి ఆగదని తేల్చి చెప్పారు. రాజకీయాల ముసుగులో ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకునే వారిని క్షమించ వద్దన్నారు. కంచ గచ్చిబౌలి భూములపై న్యాయ పోరాటం చేసి సాధించుకుంటామని.. అందులో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసి.. లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు. గచ్చిబౌలి జంక్షన్‌లో PJR ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు ముఖ్యమంత్రి.


ఈవీ, సీఎన్జీ వాహనాలకే పర్మిషన్

గుజరాత్‌కు సబర్మతి.. ఢిల్లీకి యమునా.. యూపీకి గంగా కారిడార్‌లు ఇచ్చిన ప్రధాని మోదీ.. మన మూసీ రివర్ ఫ్రంట్‌కు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణపైన కేంద్రానికి, మోదీకి, కిషన్‌రెడ్డికి ఎందుకు ఇంత వివక్ష అని నిలదీశారు. ఢిల్లీలో వాయు కాలుష్యం, చెన్నైలో వరదలు, బెంగళూరులు ట్రాఫిక్ జామ్‌లతో అవస్థలు పడుతున్నాయని.. హైదరాబాద్ మాత్రం సూపర్ సిటీ అని పొగిడారు. పొల్యూషన్ తగ్గించడానికి ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వాహనాలు కొనేలా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. నగరంలో డీజిల్ బస్సులు కాకుండా 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు నడిపిస్తామని అన్నారు. కొత్త ఆటోలపై నిషేధం ఉన్నా EV, CNG ఆటోలకు మాత్రం పర్మిషన్ ఇస్తామని తెలిపారు.


నాగార్జున రియల్ హీరో..

చెరువులు, నాలా కబ్జాలపై దృష్టి పెట్టామని చెప్పారు సీఎం. హీరో నాగార్జునకు చెందిన N కన్వెన్షన్‌ను కూల్చివేస్తే.. మళ్లీ ఆయనే వచ్చి ఆ చెరువు అభివృద్ధికి 2 ఎకరాల భూమి ఇచ్చి సహకరించారని అన్నారు. హైదరాబాద్‌లో వరదలు తగ్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. హైడ్రా ద్వారా నాలాలు, చెరువుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 30 వేల ఎకరాల్లో “భారత్ ఫ్యూచర్ సిటీ” నిర్మించబోతున్నామని.. అందులో 15వేల ఎకరాలు ఓపెన్ స్పేస్‌గా వదిలేసి అడవిని సృష్టిస్తామని సీఎం స్పష్టం చేశారు. రాబోయే 100 రోజుల్లో కోర్ అర్బన్ ప్లాన్ రెడీ చేస్తామని చెప్పారు.

పీజేఆర్ ఫ్లైఓవర్ డీటైల్స్ ఇవే..

6 వరుసలు.. 1.2 కిలోమీటర్లు.. 24 మీటర్ల వెడల్పు.. రూ.182 కోట్లు.. రోజుకు 2.72 లక్షల వాహనాలు.. ఇదీ గచ్చిబౌలిలోని పీజేఆర్ ఫ్లైఓవర్ వివరాలు. ఒకే చోట.. ఒకదాని మీద మరొకటి.. అలా మూడు ఫ్లైఓవర్లతో ఐటీ సెక్టార్ సిగలో మరో మణిహారం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

ఆ రూట్‌లో ట్రాఫిక్‌కు చెక్

ORR నుంచి కొండాపూర్, హఫీజ్‌పేట్, హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వెళ్లే వారికి మెరుగైన కనెక్టివిటీ పెరుగుతుంది. గచ్చిబౌలి జంక్షన్‌లో ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి. రద్దీ టైమ్‌లో కనీసం 10 నిమిషాల టైమ్ సేవ్ అవుతుందని అధికారులు చెబుతున్నారు.

Also Read : మహా న్యూస్‌పై దాడి చేసి బీఆర్ఎస్ ఏం మెసేజ్ ఇచ్చినట్టు?

గచ్చిబౌలి జంక్షన్‌లో ఇప్పటికే రెండు ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మూడో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఈ మూడూ ఒకదానిపై ఒకటి ఉండటం విశేషం. ప్రస్తుతం ప్రారంభించింది శిల్పా లేఅవుట్ ఫేక్ 2 ఫ్లైఓవర్. గచ్చిబౌలి మీదుగా ఎలాంటి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేకుండా డైరెక్ట్‌గా ఇటు విమానాశ్రయానికి, అటు కొండాపూర్ ఏరియాకు చేరుకోవచ్చు.

Related News

Red Alert: అత్యంత భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు.. ఏ జిల్లాలకంటే..?

Rain update: అత్యంత భారీ వర్షాలు.. ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్.. అప్రమత్తంగా ఉండండి..!

KTR Bandi Sanjay Meet: బండి సంజయ్, కేటీఆర్‌లను కలిపిన వరద.. ఇద్దరి మాటలు వింటే నవ్వులే నవ్వుల్

Pocharam Dam: డేంజర్‌లో పోచారం డ్యామ్.. 10 ఊర్లు ఖతమ్..!

Local Body Elections: పంచాయతీ ఎన్నికలకు డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

Kamareddy floods: తెలంగాణలో వర్ష బీభత్సం.. నీట మునిగిన కామారెడ్డి పట్టణం, రెసిడెన్షియల్ విద్యార్థులు సేఫ్

Big Stories

×