Chandra Mohan About Sr. NTR: చంద్రమోహన్.. తెలుగు సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. సుమారు ఐదున్నర దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగారు. హీరోగా.. సహ నటుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఎన్నో అద్భుమైన పాత్రలు పోషించారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్లు అందరితోనూ సినిమాలు చేశారు. అంతేకాదు, ఇండస్ట్రీలో టాప్ హీరోలతోనూ కలిసి సినిమాల్లో నటించారు. శోభన్ బాబు, నాగేశ్వరరావు, రామారావుతో కలిసి పని చేశారు. అయితే, ఇతర హీరోలతో మంచి సంబంధాలు ఉన్నా, రామారావుతో అంతగా లేవన్నారు చంద్రమోహన్. అంతేకాదు, రామారావుతో సినిమా సందర్భంగా తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ఆయన బతికి ఉండగా ఓసారి గుర్తు చేసుకున్నారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
సినిమా పరిశ్రమలో నాగేశ్వర్ రావుతో కలిసి చంద్రమోహన్ ఎక్కువగా సినిమాలు చేశారు. సుమారు 40 చిత్రాల్లో కలిసి నటించారు. రామారావుతో పెద్దగా సినిమాలు చేయలేదు. దానికి కారణం ఉందన్నారు చంద్రమోహన్. ఓ సినిమా విషయంలో బాలయ్య కోసం తనను మోసం చేయడాన్ని తట్టుకోలేకపోయానన్నారు. ఆయన బతికి ఉండగా, ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “ఎన్టీఆర్ తో ఓ సినిమా సమయంలో చేదు అనుభవం ఎదురయ్యింది. ఆ ఘటనను నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఓ సినిమాలో ఎన్టీఆర్ తమ్ముడి క్యారెక్టర్ ను నన్ను సెలెక్ట్ చేశారు. ఏం జరిగిందో తెలియదు. కానీ, చివరికి నన్ను కాదని, బాలయ్యను తీసుకున్నారు. నేను మేకప్ వేసుకుని సెట్స్ కు వెళ్లే సరికి నా వేషంలో బాలయ్య కనిపించాడు. మరో సినిమాలో అవకాశం ఇస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చారు. కానీ, ఇవ్వలేదు. నేను చాలా బాధపడ్డాను. ఆ తర్వాత ఆయనతో దూరంగా ఉన్నాయి. అదే సినిమాను తమిళంలో రీమేక్ చేశారు. ఆ సినిమాలో ఎంజీఆర్ హీరోగా చేశారు. ఆ సినిమాలో ఎంజీఆర్ కు తమ్ముడిగా నేను చేశారు. ఆ సినిమాతో తమిళంలో మంచి గుర్తింపు వచ్చింది” అని చెప్పుకొచ్చారు.
ఇలాంటి మాఫియా లో కూడా శిఖరాలు అధిరోహించావా బాసూ @KChiruTweets.. ఆ లూస్ టాక్ తండ్రి కొడుకులకు బాగా ఉన్నట్టుంది.
అందుకే నలభై ఏళ్లగా ఆ బ్యాచ్ రక్త కన్నీరు అన్నమాట 😂🤣 pic.twitter.com/ovUyis7RB8
— Lord Shiv🥛 (@lordshivom) June 26, 2025
చంద్రమోహన్ గురించి..
1942లో కృష్ణా జిల్లాలో జన్మించిన చంద్రమోహన్.. బిఎస్సీ వరకు చదివారు. ఆ తర్వాత సినిమాల్లో నటించాలనే ఇష్టంతో మద్రాసుకు వెళ్లారు. 1966లో ‘రంగులరాట్నం’ సినిమాతో హీరోగా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయన నటించని ‘సుఖదుఃఖాలు’, ‘బాంధవ్యాలు’ మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. 1978లో రిలీజైన ‘పదహారేళ్ల వయసు’ అప్పట్లో అద్భుత విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగులోని టాప్ హీరోయిన్లు అందరితో కలిసి నటించారు. హీరోలతోనూ నటించారు. ఏ పాత్రలో నటించినా ఇట్టే ఒదిగిపోయేవారు. నటించారు అని చెప్పడం కంటే, జీవించేవారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తం 900 సినిమాల్లో నటించిన చంద్రమోహన్.. సుమారు 175 సినిమాల్లో హీరోగా చేశారు. చంద్రమోహన్ చనిపోవడానికి ముందు గోపీచంద్ హీరోగా నటించిన ‘ఆక్సీజన్’ సినిమాలో కనిపించారు. ఆ తర్వాత కొంతకాలం అనారోగ్య సమస్యలతో బాధపడిన ఆయన.. 2023లో తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్ సినిమా రంగంలో రాణించినా, ఆయన పిల్లలను మాత్రం ఇండస్ట్రీ వైపు రానివ్వకపోవడం విశేషం.
Read Also: బాసులు జల్సా చెయ్యాలంటే.. 70 గంటలు పని చెయ్యండి.. సోనీ లివ్ సెటైరికల్ ప్రోమో!