BigTV English

BRS : మీడియాపై దాడితో ఏం మెసేజ్ ఇచ్చినట్టు? మళ్లీ ఉద్యమం నాటి భయం క్రియేట్ చేస్తున్నారా?

BRS : మీడియాపై దాడితో ఏం మెసేజ్ ఇచ్చినట్టు? మళ్లీ ఉద్యమం నాటి భయం క్రియేట్ చేస్తున్నారా?

BRS : మహా న్యూస్‌పై బీఆర్ఎస్ శ్రేణుల మెరుపు దాడి. ఒక్కసారిగా రాళ్లతో విరుచుకుపడ్డారు. కార్లు, అద్దాలు, స్టూడియో, ఆఫీసు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కేటీఆర్‌పై ఫేక్ న్యూస్ నడుపుతున్నారంటూ.. అల్లరి మూక అరాచకం సృష్టించింది. ఓవైపు యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడం జర్నలిస్టులను మనోవేధనకు గురి చేస్తుంటే.. ఇప్పుడిలా మీడియా స్వేచ్ఛపై గులాబీ దండు కిష్కిందకాండ ఉన్మాదాన్ని తలపిస్తోందని అంటున్నారు. ఏం మెసేజ్ ఇస్తున్నారా? MAHAA NEWSపై అటాక్ చేసి ఎవరిని భయపెట్టాలని చూస్తున్నారు? అని మండిపడుతున్నారు జర్నలిస్ట్ సంఘాల నేతలు.


కేటీఆరే రెచ్చగొట్టారా?

మీడియా సంస్థలకు వార్నింగ్ ఇస్తూ KTR ట్వీట్ చేయడం.. గంటల గ్యాప్‌లోనే దాడి జరగడం చూస్తుంటే.. ఆయనే ఈ పని చేయించారా? అనే డౌట్ వస్తోంది. కుట్రకు సూత్రధారి వర్కింగ్ ప్రెసిడెంటే అనే ప్రచారమూ నడుస్తోంది. మహా న్యూస్ చేసిన తప్పు కూడా ఏం లేదంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్ని ఆరోపణలు వస్తున్నా.. కేసీఆర్, కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ ప్రశ్నించింది ఆ ఛానెల్. అంతే. అందుకే ఆయనకు కోపం వచ్చిందా? కారు కార్యకర్తలు మెడలో గులాబీ కండువాలు వేసుకుని మరీ ఆ ఛానెల్‌పై దాడి చేశారంటే తమ ఉనికిని బలంగా చాటుకోవాలనేగా? కేటీఆర్ పేరు చెప్పి మరీ విధ్వంసం సృష్టించారంటే భయపెట్టాలనేగా? అని అంటున్నారు. ఈ సందర్భంగా ఉద్యమం నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నారు.


ఉద్యమం నుంచి ఏం నేర్చుకున్నట్టు?

తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్‌లో ఒకరకమైన భయాందోళనలు ఉండేవి. ఎప్పుడు ఎక్కడ ఎవరు దాడి చేస్తారోనని ఓ వర్గం బెరుకుగా ఉండేది. ఐటీ కంపెనీలు, అద్దాల మేడలు ఉన్న వారు తమ బిల్డింగ్‌లకు సేఫ్టీగా వలలు కట్టుకునే వారు. కానీ, 15 ఏళ్ల ఉద్యమంలో ఏనాడు గొడవలు, దాడులు జరిగింది లేదు. ప్రజలపై ఒక్క రాయి కూడా పడలేదు. ఒక్క ఆఫీసు కూడా ధ్వంసం చేయలేదు. విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వడం మినహా.. ప్రపంచంలోనే శాంతియుతంగా సాగిన ఉద్యమంగా గుర్తింపు కూడా పొందింది తెలంగాణవాదం. అలాంటి తెలంగాణలో.. బీఆర్ఎస్ శ్రేణులు ఇలా రాళ్ల దాడితో విధ్వంసానికి దిగడాన్ని ఎలా చూడాలి? కేటీఆర్ కనుసన్నల్లోనే ఈ అటాక్ జరిగిందని అంటున్నారంటే.. ఆ పార్టీ మీడియాను భయపెట్టాలని చూస్తోందని అనుకోవాలా?

Also Read : ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ట్విస్ట్.. కేసీఆర్‌కు చిక్కులే!

కేటీఆర్ సమర్థించుకుంటారా? సరిచేసుకుంటారా?

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నడిచే టీ న్యూస్, నమస్తే తెలంగాణలో వన్ సైడ్ వార్తలు వండి వడ్డించడం లేదా? మహా న్యూస్ మాత్రమే లైన్ దాటిందా? ఆ వార్త నచ్చకపోతే నిరసన తెలిపే విధానం, పద్దతి వేరే ఉంటుంది. అంతేగాని ఇలా రాళ్ల దాడి చేయడం ఏంటి? ఫోన్ ట్యాపింగ్‌పై మౌనం ఎందుకు అంటే అంతగా ఉలుకెందుకు? ఉద్యమమే ప్రశాంతంగా నడిపిన TRS.. మరిప్పుడు ఈ దాడులతో సభ్య సమాజానికి BRSగా ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? దాడులతో మళ్లీ భయాందోళనలు క్రియేట్ చేయాలని చూస్తున్నారా? లేదంటే, ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిగా ఇరుక్కుపోయామని ఫిక్స్ అయ్యారా? జైలుకు వెళ్లడం తప్పదని కన్ఫామ్ చేసుకున్నారా? ఆ భయంతోనే ఇలా దాడులకు తెగబడుతున్నారా? ఇలా అనేక ప్రశ్నలు, విమర్శలు వినిపిస్తున్నాయి. మరి, ఈ విధ్వంసాన్ని కేటీఆర్ సమర్థించుకుంటారా? సరిచేసుకుంటారా? అంటే ఆయన చేసిన ట్వీట్‌తో అసలు ఉద్దేశ్యం బయటపడుతోంది. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఛాన్స్ లేదంటూనే.. మీడియా ముసుగులో నీచపు రాజకీయాలంటూ మరింత రెచ్చగొట్టేలా కేడర్‌కు మెసేజ్ ఇచ్చారని అంటున్నారు.

Related News

Weather News: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వానలు, బయటకు వెళ్తే అంతే సంగతులు..!

Telangana Politics: అనిరుధ్ రెడ్డి vs కేటీఆర్, ప్రతీది రాజకీయమే.. స్వేచ్ఛ మీ దగ్గరెక్కడ?

Telangana politics: మొదలైన స్థానిక ఎన్నికల వేడి.. సీఎం రేవంత్ కీలక భేటీ, ఏడున అభ్యర్థుల ప్రకటన

Minister Uttam: తెలంగాణలో ఈసారి రికార్డ్ స్థాయిలో ధాన్యం ఉత్పత్తి.. దేశంలో మరోసారి అత్యధికంగా..?

Weather News: ఈ జిల్లాల్లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్, ఈ టైంలో బయటకు వెళ్లొద్దు

Free Bus Ticket: డీలక్స్ బస్సులో ఫ్రీ టికెట్ ఇవ్వలేదని.. బస్సు కింద పడుకుని మహిళ హల్ చల్

Rains Effect: ఓరుగల్లులో చినుకు పడితే చిత్తడే.. ఎన్నాళ్లీ వరద కష్టాలు..

Hyderabad News: లోకల్ బాడీ ఎన్నికల్లో 80 శాతం మావే.. జీవోపై ఆ రెండు పార్టీలు కోర్టుకు?- టీపీసీసీ

Big Stories

×