CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు. అయితే పలు కీలక విషయాలపై సీఎం రేవంత్ మీడియా ముఖంగా క్లారిటీ ఇచ్చారు. ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డిలకు గ్యాప్ ఉందని ఓ వర్గం విస్తృత ప్రచారం సాగించింది. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు, సీఎం వద్ద ప్రస్తావించగా క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇతర నేతలు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పు ఇతర అంశాలపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించేందుకు వీరు ఢిల్లీ వెళ్లారు. ఇప్పటికే పలువురితో వీరు భేటీ కాగా, తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు సాగినట్లు తెలుస్తోంది. కాగా మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు రాహుల్ గాంధీకి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, ఇద్దరి మధ్య సాన్నిహిత్యం అలానే ఉందంటూ సీఎం క్లారిటీ ఇచ్చారు. అవాస్తవాలు ప్రచారం సాగడంలో ఎప్పుడూ ముందుంటాయని సీఎం అభిప్రాయ పడ్డారు.
ఇక మంత్రివర్గ విస్తరణపై స్పందించిన సీఎం.. ఏ నిర్ణయమైనా అధిష్టానానిదే తుది నిర్ణయం అవుతుందన్నారు. అలాగే పలువురు మీడియా ప్రతినిధులు తెలంగాణలో ప్రతిపక్ష నేతల కేసుల గురించి అడగగా.. తాము చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని, చట్టాన్ని ఉల్లంఘించి తమ ప్రభుత్వం ఎప్పుడూ ప్రవర్తించలేదన్నారు. తనకు ఉన్న అవకాశం మేరకు అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నట్లు, ఏడాది పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించడమే కాక, ఎన్నో పథకాలను ప్రవేశపెట్టినట్లు సీఎం అన్నారు.
కులగణన ఆషామాషీగా చేసింది కాదని, ఎంతో పకడ్బందీగా రాష్ట్రంలో విజయవంతం చేశామన్నారు. కులగణన సర్వే ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు, నివేదికను కూడ ప్రజల ముందుంచామని సీఎం తెలిపారు. పీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చిందని, ఈరోజు లేదా రేపు ప్రకటన ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
నాకు రాహుల్ గాంధీకి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు….ఇద్దరి మధ్య సాన్నిహిత్యం అలానే ఉంది : సీఎం రేవంత్
మంత్రివర్గ విస్తరణపై అధిష్టానానిదే తుది నిర్ణయం
ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం
నాకు ఉన్న అవకాశం మేరకు అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా… pic.twitter.com/CfwySzYRe7
— BIG TV Breaking News (@bigtvtelugu) February 7, 2025