Jack Teaser: ఎన్నో ఏళ్లుగా నటుడిగా టాలీవుడ్‌లో కాస్త గుర్తింపు కోసం ఎదురుచూస్తూ వచ్చాడు సిద్ధు జొన్నలగడ్డ. అలాంటి తన కెరీర్, లైఫ్ అంతా ఒక్కసారిగా ‘డీజే టిల్లు’తో టర్న్ అయిపోయింది. అప్పటినుండి సిద్ధు కంటే డీజే టిల్లుగానే తనను ఎక్కువగా గుర్తుపెట్టుకున్నారు ప్రేక్షకులు. అప్పటినుండి తను ఏ సినిమాలో నటించినా కూడా యూత్‌లో మాత్రం మంచి హైప్ క్రియేట్ అవుతోంది. ‘డీజే టిల్లు’ తర్వాత దాదాపు హీరోగా అరడజను సినిమాలను సైన్ చేశాడు సిద్ధు. అందులో ఒకటి ‘జాక్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలయ్యింది. టీజర్ మొత్తం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్‌పై సాగిపోయింది.
అస్సలు చెప్పకూడదు
‘‘నా ప్రాబ్లమ్ పేరు పాబ్లో నెరోడా’’ అంటూ నరేశ్ చెప్పే డైలాగ్‌తో ‘జాక్’ టీజర్ ప్రారంభమవుతుంది. వాడు ఏం చేస్తున్నాడో నాకు తెలియాలి అంటూ టెన్షన్ పడుతున్న సమయంలోనే చాలా స్టైలిష్ లుక్‌తో, కూల్ యాటిట్యూడ్‌తో సిద్ధు ఎంట్రీ ఇస్తాడు. అప్పుడే వైష్ణవి చైతన్య కూడా హీరోయిన్‌గా ఎంటర్ అవుతుంది. ‘‘మీ నాన్నకు కూడా తెలియనంత గలీజ్ జాబ్ ఏం చేస్తున్నావు’’ అంటూ అసలు సిద్ధు చేసే జాబ్ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటుంది. ‘‘అది అస్సలు చెప్పకూడదు’’ అంటూ అసలు తన జాబ్ ఏంటో రివీల్ చేయడు సిద్ధు. ‘జాక్’ టీజర్‌లో అసలు సిద్ధు జాబ్ ఏంటో తెలియకపోవడమే హైలెట్‌గా నిలిచింది.
జాబ్ ఏంటో.?
ఒకరోజు సిద్ధు బైక్ కొట్టేయడం చూసే వైష్ణవి.. ‘‘నువ్వు బైకులు కొట్టేస్తావా’’ అంటూ షాకవుతుంది. ఇది కేవలం పార్ట్ టైమ్ జాబే అంటూ తన స్టైల్‌లో సమాధానమిస్తాడు సిద్ధు. ‘‘నువ్వు ఉరి వేసుకున్నా కూడా నేనేం చేస్తానో చెప్పను’’ అంటూ తన తండ్రితో కూడా తన జాబ్ ఏంటో చెప్పడు హీరో. మధ్యలో బుర్కా గెటప్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లపై సెటర్ డైలాగ్.. ఇలాంటివన్నీ ‘జాక్’ టీజర్‌లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేలా ఉన్నాయి. అప్పటివరకు సాఫీగా సాగిపోతున్న ‘జాక్’ (Jack) టీజర్.. ఒక్కసారిగా యాక్షన్‌లోకి మారుతుంది. ఇప్పటివరకు కామెడీతోనే నవ్వించిన ఈ హీరో.. ఈసారి యాక్షన్‌లోకి దిగి ఫైట్స్‌తో కూడా ఎంటర్‌టైన్ చేయనున్నాడని తెలుస్తోంది.
Also Read: ప్రధాని మోడీకి నాగార్జున విలువైన గిఫ్ట్.. కొత్త జంటతో కలిసి..
ఈసారి యాక్షన్ కూడా
యూత్ కోసం ‘జాక్’ టీజర్ చివర్లో ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda). వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) వచ్చి నాకొక లవ్ స్టోరీ ఉంది అని చెప్పగానే ‘‘ఛీ.. దరిద్రం మళ్లీ మొదలయ్యింది’’ అని అంటాడు సిద్ధు. మొత్తానికి ‘జాక్’ టీజర్ అంతా ఫన్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా సాగిపోతుంది. సిద్ధు జొన్నలగడ్డ నుండి యూత్ అంతా ఏం ఆశిస్తున్నారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. పైగా ఈసారి కొత్తగా యాక్షన్‌లోకి కూడా దిగనున్నాడు ఈ హీరో. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ మూవీతో మొదటిసారి వైష్ణవి చైతన్యతో జోడీకట్టాడు సిద్ధు జొన్నలగడ్డ. ‘బేబి’ తర్వాత మొదటిసారి మరో మంచి పాత్రతో ఆడియన్స్‌ను అలరించనుంది వైష్ణవి.