FIFA: పాకిస్తాన్ ( Pakisthan ) దేశం అంటే మన ఇండియాకు ( India ) అస్సలు పడదు. ఇండియా అలాగే పాకిస్తాన్ ( Pakisthan ) మధ్య సరిహద్దు సమస్య నెలకొన్న సంగతి తెలిసిందే. కొన్ని సంవత్సరాలుగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య ఏ మ్యాచ్ జరిగినా కూడా ఉత్కంఠ గా చూస్తారు. అదే సమయంలో పాకిస్తాన్ ఓడిపోతే కూడా ఇండియాలో సంబరాలు జరుపుకుంటూ ఉంటారు.
Also Read: BCCI: టీమిండియాకు ఛాంపియన్స్ రింగ్… ప్లేయర్లకు కూడా భారీ ట్రీట్ ?
అలాగే అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్ కు ( Pakisthan ) ఏదైనా ఎదురుదెబ్బ తగిలిన… కూడా మన ఇండియన్స్ చాలా హ్యాపీగా… సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే సరిగ్గా ఇండియాకు చావు కబురు చల్లగా చెప్పినట్లు.. తాజాగా ఫిఫా కీలక ప్రకటన చేసింది. పాకిస్తాన్ కు ఊహించని షాక్… ఇస్తూ… సంచలన ప్రకటన చేసింది. పాకిస్తాన్ ఫుట్ బాల్ ఫెడరేషన్ (Pakistan Football Federation ) ను సస్పెండ్ చేసింది ఫిఫా. పాకిస్తాన్ ఫుట్ బాల్ ఫెడరేషన్ (Pakistan Football Federation ) ను అంతర్జాతీయ ఫుట్బాల్ ఫెడరేషన్ తాజాగా సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది. తమ నిబంధనలను పాటించడంలో పాకిస్తాన్ ఫుట్ బాల్ ఫెడరేషన్ (Pakistan Football Federation ) దారుణంగా విఫలమైందని గుర్తించిన ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఫెడరేషన్ ( FIFA ) ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కిస్తాన్ ఫుట్ బాల్ ఫెడరేషన్ (Pakistan Football Federation ) లో సజావుగా ఎన్నికల నిర్వహణ అలాగే గ్రూప్ జాన్ని నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకొని.. నార్మలైజేషన్ కమిటీని ఫిఫా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నార్మలైజేషన్ కమిటీని 2019 సంవత్సరంలో… ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ కమిటీ ద్వారా ఫలితాలు రాలేదని తాజాగా గుర్తించింది. దీంతో కిస్తాన్ ఫుట్ బాల్ ఫెడరేషన్ (Pakistan Football Federation ) ను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. అయితే పాకిస్తాన్ ఫుట్బాల్ ఇలా సస్పెండ్ కావడం మొదటిసారి ఏం కాదు. గతంలో కూడా కిస్తాన్ ఫుట్ బాల్ ఫెడరేషన్ (Pakistan Football Federation ) సస్పెన్షన్ కు గురి అయింది. ఇప్పటి వరకు మూడుసార్లు సస్పెన్షన్ కు గురి అయింది పాకిస్తాన్.
Also Read: IPL 2025: ఐపీఎల్ ప్రారంభం కంటే ముందే…ప్రమాదంలో RCB, SRH ?
2017 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మొత్తం… మూడుసార్లు సస్పెన్షన్ అయింది పాకిస్తాన్ ఫుట్బాల్ ఫెడరేషన్ (Pakistan Football Federation ). ఫిబ్రవరి 15 తన పదవీ కాలానికి చివరి రోజు అని, రాజ్యాంగ సవరణలను అమలు చేయకపోతే పాకిస్తాన్ సస్పెండ్ చేసే ప్రమాదం ఉందని పిఎఫ్ఎఫ్ నార్మలైజేషన్ కమిటీ చైర్మన్ హరూన్ మాలిక్ పార్లమెంటరీ ప్యానెల్ను ఇప్పటికే హెచ్చరించారు. కానీ అంతలోనే అంత జరిగిపోయింది. పాకిస్తాన్ ఫుట్ బాల్ ఫెడరేషన్ (Pakistan Football Federation ) ను సస్పెండ్ చేసింది ఫిఫా.