BigTV English

CM Revanth Reddy travel on driverless: ముగిసిన అమెరికా టూర్, శాన్‌ఫ్రాన్సిస్కోలో డ్రైవర్‌ రహిత కారులో సీఎం రేవంత్ ట్రావెల్

CM Revanth Reddy travel on driverless: ముగిసిన అమెరికా టూర్, శాన్‌ఫ్రాన్సిస్కోలో డ్రైవర్‌ రహిత కారులో సీఎం రేవంత్ ట్రావెల్

CM Revanth Reddy travel on driverless: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా టూర్ ముగిసింది. దాదాపు 10 రోజుల టూర్‌లో 19 కంపెనీలు దాదాపు 31 వేల కోట్లు రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.


దాదాపు 50 కంపెనీలతో సమావేశమైంది రేవంత్ టీమ్. ఆర్టిఫిషియల్, ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సెన్సెన్స్, విద్యుత్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే దిశంగా ఆయా కంపెనీలు ముందుకొచ్చాయి.

అమెరికా పర్యటనపై సీఎం రేవంత్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని పేరు పొందిన కంపెనీలతో సంప్రదింపులు జరిపామన్నారు. ముఖ్యంగా స్కిల్ యూనివర్సి టీ ఏర్పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్యూచర్ సిటీ నిర్మించే దిశగా అడుగులు వేశామన్నారు.


ALSO READ: బీఆర్ఎస్ వలస నేతలకు కాంగ్రెస్ ‘తాయిలాలు‘ సిద్ధం

అమెరికాలోకి బిజినెస్‌మేన్ల నుంచి భారీ మద్దతు లభించిందన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలతలు, ప్రభుత్వం అందించే సహకారాన్ని అక్కడికి కంపెనీలకు వివరించామన్నారు. ఈ టూర్ తెలంగాణకు మంచి ఫలితాలు వస్తాయని, పెట్టుబడులతోపాటు వేలాది ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

CM Revanth Reddy travel on driverless
CM Revanth Reddy travel on driverless

అమెరికా టూర్ చివరలో శాన్‌ఫ్రాన్సిస్కోలో డ్రైవర్‌ రహిత కారులో ప్రయాణించారు సీఎం రేవంత్‌రెడ్డి. దాదాపు పావుగంట సేపు అందులో ట్రావెల్ చేశారు. ఆ తరహా కార్లు, టెక్నాలజీ ఇండియాకి వస్తే, ప్రయాణం మరింత సులభంగా మారుతుందన్నారు. అమెరికా టూర్ ముగించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి అక్కడి నుంచి సౌత్‌కొరియా రాజధాని సియోల్‌కు చేరుకున్నారు.

 

Related News

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 25న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Big Stories

×