Viral Video: ఒక కాలేజీలో పనిచేసే ఓ మేనేజర్ అక్కడ జూనియర్ మహిళా టీచర్లను లైంగికంగా వేధిస్తున్నాడు. అతని ఆకృత్యాలతో విసిగిపోయిన ఒక యువ టీచర్.. ఆ కీచక మేనేజర్ కు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఒక ప్లాన్ వేసింది. దాంతో అందరి ముందు అతని నిజరూపం బయటపడింది. ఆ మేనేజర్ పై త్వరలోనే చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు చెప్పారు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్‌పూర్ నగరంలో హనుమాన్ ఇంటర్ కాలేజీలో మేనేజర్ గా పనిచేసే రవి ప్రతాప్ గోయల్ అనే వ్యక్తి అక్కడ జూనియర్ సిబ్బందిగా పనిచేసే మహిళా టీచర్లను వేధిస్తున్నాడు. వారిని ఒంటరిగా పిలిచి అసభ్యంగా మాట్లాడేవాడు. ఇటీవలే ఆ కాలేజీలో టీచర్ గా ఉద్యోగం పొందిన రుపాలి అనే యువతికైతే అతను నరకం చూపించడంతో ఆమె అతని బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంది. రెండు రోజుల క్రితం మేనేజర్ రవి ప్రతాప్ గోయల్ వద్ద రుపాలి వెళ్లి తనకు రెండు రోజులు సెలవు కావాలని కోరింది. దానికి ఆ మేనేజర్ కుదరదు చాలా కష్టం అని చెప్పాడు. దీంతో రుపాలి ప్లీజ్ సర్ చాలా అవసరం అని అడిగింది. అయినా అతను కనికరించలేదు. రుపాలి మళ్లీ మళ్లీ అడిగేసరికి.. సరే అని అసభ్యగా సైగలు చేశాడు.
తన బుగ్గపై వేలు చూపిస్తూ.. ఆమె తనకు ఒక ముద్దు పెట్టాలని అడిగాడు. కానీ రుపాలి అతని నోటితోనే చెప్పించేందుకు అమాయకంగా ‘నాకు అర్థం కాలేదు. కాస్త స్పష్టంగా చెప్పండి.’ అని అడిగింది. దానికి మేనేజర్ గోయల్.. ‘సెలవు కావాలంటే ఇక్కడ ముద్దు పెట్టు నీ సమస్య గురించి మరిచిపో.. హాయిగా సెలవు తీసుకో.. అంతే చాలా సింపుల్’ అని చెప్పాడు.
Also Read: వెబ్ సిరీస్ చూసి బాలుడి మర్డర్.. ప్రేమ కోసం హంతకురాలిగా మారిన ఎంబిబియస్ విద్యార్థిని
దానికి రుపాలి.. ”లేదు.. నేను అలాంటి తప్పుడు పనిచేయను. ఇలాంటివి నాకు చెప్పకండి” అని సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ఈ సంఘటన అంతా రుపాలి తన మొబైల్ ఫోన్ లో వీడియో తీసింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Also Read: ‘ఉద్యోగం కావాలంటే బాస్ తో సమయం గడపాలి’.. మహిళకు కండిషన్ పెట్టిన మేనేజర్
ఈ వీడియో పై కాలేజీ మెనేజర్ గోయల్ స్పందించాడు. మేనేజర్ కూడా ఒక కౌంటర్ వీడియో తీశారు. ఆ రెండో వీడియో మేనేజర్ మాట్లాడుతూ.. ”నేను ఏ తప్పు చేయలేదు.. నా పై బురద జల్లేందుకు కుట్ర చేశారు.. వీడియోలో ఉన్నదంతా నిజం కాదు.” అని చెప్పాడు. పైగా ఆ మేనేజర్ తీసిన వీడియోలో కాలేజీలోని ఇతర సిబ్బందిని కూడా పిలిచి తను చాలా మంచివాడినని చెప్పించాడు. మరోవైపు ఈ వీడియో చూసిన విద్యాశాఖ అధికారులు.. తాము విచారణ చేసి.. ఆ మేనేజర్ తప్పు చేశాడని తేలితే.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
#यूपी में अटेंडेंस अभी भी चर्चा में है…
सरकार ने डिजिटल अटेंडेंस का फ़रमान तो वापस ले लिया मगर #उन्नाव के सरकारी स्कूल के मास्टर साहब हाज़िरी लगाने के लिए महिला अध्यापक से “पप्पी” की माँग कर रहे हैं। अटेंडेंस लगानी है… पप्पी दो..!!
*मास्टर साहब* :: महिला अध्यापक से मजे ही… pic.twitter.com/vaFtD1VLMs
— Mamta Tripathi (@MamtaTripathi80) August 7, 2024