BigTV English

CM Revanth Reddy: ధరణి కమిటీతో నేడు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ.. వాటిపైనే ఫోకస్..

CM Revanth Reddy: ధరణి కమిటీతో నేడు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ.. వాటిపైనే ఫోకస్..
CM Revanth Reddy Review Meeting on Dharani Portal
CM Revanth Reddy

CM Revanth Reddy Review Meeting on Dharani Portal(Telangana news live): సీఎం రేవంత్ రెడ్డి ధరణి పోర్టల్ కమిటీతో నేడు రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. ధరణి పోర్టల్లో నిలిచిపోయిన పెండింగ్ అప్లికేషన్లపై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.50 లక్షల అప్లికేషన్లు వివిధ సమస్యలతో ధరణిలో పెండింగ్‌లో ఉన్నాయి.


కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ధరణిలో అమ్మకాలు, కొనుగోళ్లు తప్ప ఇతరత్రా అప్లికేషన్లు వేటిని కూడా ప్రాసెస్ చేయలేదు. ధరణి కేంద్రంగా గత ప్రభుత్వం అక్రమాలు చేసిందన్న ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. వాటిని గుర్తించే పనిలో నిమగ్నం అయ్యారు. ధరణి పోర్టల్‌పై కమిటీని కూడా ఏర్పాటు చేసింది సీఎం రేవంత్ సర్కార్. ఈ కమిటీ ఇప్పటివరకు వివిధ శాఖల అధికారులతో, జిల్లా కలెక్టర్లతో సమావేశయ్యింది. పలుమార్లు భేటీ అయిన ధరణి కమిటీ సమస్యలపై అధ్యయయం చేశారు.

Read More: కాళేశ్వరం స్కామ్‌పై త్వరలో జ్యుడీషియల్ ఎంక్వైరీ.. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం..


దీంతో సీఎం రేవంత్ రెడ్డి రివ్వూ మీటింగ్‌లో వాటిపై చర్చించనున్నారు. నిషేదిత జాబితాలో ఎదురవుతోన్న సమస్యలపై, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అటవీ శాఖ భూములు, షెడ్యూల్ ఏరియాల్లో భూ సమస్యలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఇనాం భూములు, జాగీర్ భూముల, వాటి రిజిస్ట్రేషన్ల సమయంలో ఎదురవుతోన్న సమస్యలపై ధరణి కమిటీ సీఎం రేవంత్ రెడ్డికి వివరించనున్నారు. భూపరిపాలనకు సంబంధించి రెవెన్యూ వ్వవస్థలో మార్పులు, చేర్పులపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా శనివారం జరిగే రివ్యూ మీటింగ్‌లో జిల్లా కలెక్టర్లు విడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్నారు.

Related News

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Mallareddy: మల్లారెడ్డి యూటర్న్.. రాజకీయాల్లో నో రిటైర్మెంట్

Telangana rains: మళ్ళీ ముంచెత్తనున్న వర్షాలు.. ఆగస్టు 14 నుండి 17 వరకు జాగ్రత్త!

Big Stories

×