E-Paper
Advertisement

CM Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, రెండు రోజులు అక్కడే మకాం, మేటరేంటి?

CM Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, రెండు రోజులు అక్కడే మకాం, మేటరేంటి?
Advertisement

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ఢిల్లీకి వెళ్తున్నారు. రెండురోజులపాటు ఆయన అక్కడే ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ పదవులతోపాటు, కేబినెట్ విస్తరణ , రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రపెద్దలతో ఆయన చర్చించనున్నారని సమాచారం. 

శనివారం ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

Advertisement

ఢిల్లీలో శనివారం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. పార్టీకి సంబంధించి వివిధ అంశాలపై చర్చించ నున్నారు.  ముఖ్యంగా ఉపాధి పథకం పేరు మార్పుపై ఈ సమావేశంలో ప్రస్తావించనున్నారు. అలాగే పార్టీ అగ్రనేతలను ఆయన కలవనున్నారు. పెండింగ్‌లో ఉన్న పార్టీ పదవులు, కేబినెట్ విస్తరణపై ఆయన చర్చించే అవకాశమున్నట్లు గాంధీ‌భవన్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

ఈ క్రమంలో అగ్రనేతలతో భేటీ కానున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు గెలిచిన విషయాన్ని వివరించనున్నారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల గురించి వివరించనున్నారు.  దాదాపు రెండేళ్ల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్ రావడంపై వివరించే అవకాశముందని పార్టీ వర్గాల మాట. 

పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరు

ఆదివారం కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం బడ్జెట్ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన విషయాలపై కేంద్రమంత్రులను కలవనున్నారు. వీలైతే ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యే అవకాశం ఉందని చెబుతున్నాయి.  దీనికితోడు పెండింగ్ అంశాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పలువురు మంత్రులను కలవనున్నారు ముఖ్యమంత్రి.

ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రానున్నారు ముఖ్యమంత్రి.  29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.  తొలిరోజు సమావేశంలో డిప్యూటీ స్పీకర్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ ఎన్నిక జరగనుంది. ఆ తర్వాత సమావేశాలు జనవరి రెండుకు వాయిదా పడనున్నాయి. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై అసెంబ్లీలో చర్చించే అవకాశమున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

ALSO READ: జగిత్యాలలో నయా పంచాయతీ.. ఇద్దరిలో గెలుపెవరిది?

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×