Davos In CM Revanth: పెట్టుబడులను తెలంగాణకు రప్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి టీమ్. తమ రాష్ట్రంలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలి? అందుకు కారణాలు, లక్ష్యాలను పారిశ్రామికవేత్తలకు వివరించింది. ముఖ్యంగా సాంకేతిక, ఉపాధి, నైపుణ్య రంగాల్లో దేశంలో ఫస్ట్ ప్లేస్‌లో తెలంగాణను నిలపడమే లక్ష్యమన్నారు.
సోమవారం దావోస్‌లో గ్రాండ్ ఇండియా పెవిలియన్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని గుర్తుచేశారు. ఇండియా 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనలో తెలంగాణ ఓ ట్రిలియన్ అర్థిక వ్యవస్థగా భాగస్వామ్యం కావాలన్నదే తమ ఆకాంక్షగా చెప్పుకొచ్చారు.
సాఫ్ట్‌వేర్, ఫార్మా, లైఫ్ సైన్స్ రంగాల్లో తమ రాష్ట్రం వేగంగా దూసుకెళ్తుందన్నారు. దీనికితోడు ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో 30 శాతం తమ రాష్ట్రానిదేనని చెప్పుకొచ్చారు. ఇక వ్యవసాయానికి వచ్చేసరికి ఉన్నత స్థానంలో ఉన్నామని, దేశం ఎదుగుదలలో మా భాగస్వామ్యం ఉండాలన్నదే లక్ష్యంగా మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు.
ఇండియా సూపర్ పవర్‌గా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇండియా ఎట్ దావోస్- ఇన్వెస్ట్ ఇన్ ఇండియా నినాదంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రాతినిధ్య వహించిన విషయాన్ని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, ఆగ్రో ప్రాసెసింగ్‌తో పాటు స్కిల్ డెవలప్మెంట్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
ALSO READ: రేషన్ కార్డు జాబితాలో పేరు లేదా.. డోంట్ వర్రీ అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ కొత్త రాష్ట్రమని, గతేడాది దావోస్‌కు వచ్చామని గుర్తు చేశారు మంత్రి. గతంలో ఆశించిన స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని, ఈసారి మరిన్ని పెట్టుబడులు వస్తాయని తాము ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ గురించి పారిశ్రామిక వేత్తలకు వివరించారు.
దావోస్‌లో తొలి రోజు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాటు కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరి, మంత్రి శ్రీధర్‌బాబు, కేరళ పరిశ్రమల శాఖ మంత్రితోపాటు అనేక మంది ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు రేవంత్‌రెడ్డి టీమ్ పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయి తెలంగాణ గురించి వివరించారు.
Hon'ble Chief Minister Shri @revanth_anumula , along with dignitaries from India, attended the inauguration of the Grand India Pavilion at the World Economic Forum (@wef) in #Davos.
Union Minister of Food Processing Industries Shri @iChiragPaswan, Union Minister of State… pic.twitter.com/pwjr3Gad0c
— Telangana CMO (@TelanganaCMO) January 20, 2025