BigTV English

OTT Movie : చెల్లికి వేధింపులు, ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ అన్న చేసే పనికి దిమాక్ కరాబ్… ట్విస్టులతో మతి పోగొట్టే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : చెల్లికి వేధింపులు, ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ అన్న చేసే పనికి దిమాక్ కరాబ్… ట్విస్టులతో మతి పోగొట్టే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు రకరకాల కథలతో, ప్రేక్షకులను టెన్షన్ పెడుతూ ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాయి. వీటిలో ఒక తమిళ్ మూవీ ట్విస్టులతో చివరి వరకు అదరగొట్టింది. గత ఏడాది వచ్చిన ఈ మూవీలో తమిళ్ కమెడియన్ సతీష్ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘సత్తమ్ ఎన్ కైయిల్‘ (Sattam En Kaiyil). 2024 లో విడుదలైన ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి చాచీ   దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సతీష్ ప్రధాన పాత్రలో నటించగా, అజయ్ రాజ్, పావెల్ నవగీతన్, మైమ్ గోపి, రితిక తమిళ్ సెల్వి, విద్యా ప్రదీప్ సహాయక పాత్రల్లో నటించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

గౌతమ్ రాత్రి సమయంలో టెన్షన్ పడుతూ కారు నడుపుతుంటాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఒక బైక్ ని ఢీకొంటాడు. బైక్ నడుపుతున్న బాలు అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోతాడు. గౌతమ్ కి ఏం చేయాలో తెలియక, ఆ బాడీని వేరొక చోట పడేయాలని చూస్తాడు. ఆ బాడీని ఎవరూ చూడకుండా కారు డిక్కీలో వేసుకుని వెళ్తుంటాడు. పోలీసులు చెకింగ్ చేస్తూ ఉండడంతో పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే చెక్పోస్ట్ దగ్గర పోలీసులు అతన్ని పట్టుకుంటారు. ఈలోగా గౌతమ్ మందు తాగుతున్నట్టు నటిస్తూ బాటిల్ పట్టుకుంటాడు. మందు తాగుతున్నందున పారిపోవడానికి ప్రయత్నించానని అబద్ధం చెప్తాడు. అయితే డిక్కీ తీయబోతున్న పోలీస్ ని డైవర్ట్ చేయడానికి ఎస్ఐని చంప మీద కొడతాడు. ఎస్సై కోపంతో గౌతమ్ ని సెల్లో వేస్తాడు. గౌతమ్ శవం దొరకలేదని ఊపిరి పీల్చుకుంటాడు.

అయితే అదే ప్రాంతంలో మరొక అమ్మాయి మర్డర్ జరుగుతుంది. ఆ అమ్మాయి ఫోన్ కనిపించకుండా పోతుంది. సీఐ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటాడు. అయితే ఫోన్ గౌతమ్ దగ్గర ఉండటంతో ఆశ్చర్యపోతాడు. సీఐ గౌతమ్ ని సీక్రెట్ గా విచారిస్తూ, ఫోన్ ఎక్కడ దొరికింది అని అడుగుతాడు. అప్పుడు చనిపోయిన బాలు అనే వ్యక్తి దగ్గర దొరికింది అని చెప్తాడు. ఈ కేసులో ముందుకు వెళ్లే కొద్దీ దిమ్మ తిరిగే విషయాలు బయటకు వస్తాయి. చివరివరకు ఈ హత్యల వెనుక అసలు వ్యక్తి ఎవరో సస్పెన్స్ గానే చూపిస్తారు. చనిపోయిన అమ్మాయి మర్డర్ కి, గౌతమ్ కి సంబంధం ఉందా? పోలీసులు ఈ కేసును ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు? బాలు దగ్గర చనిపోయిన అమ్మాయి ఫోన్ ఎలా వచ్చింది? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ‘సత్తమ్ ఎన్ కైయిల్’ (Sattam En Kaiyil) క్రైమ్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×