OTT Movie : థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటిలో ఫీల్ గుడ్ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. థియేటర్లలో చూడకపోయినా, ఓటిటి ప్లాట్ ఫామ్ లో మళ్లీ మళ్లీ చూస్తూ ఉంటారు. ఇందులో మలయాళం నుంచి వచ్చే సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. బోర్ కొట్టించకుండా స్టోరీని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో, మలయాళం ఇండస్ట్రీ ముందు వరుసలో ఉంది. అటువంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
జి ఫైవ్ (Zee5) లో
ఈ మలయాళం లవ్ స్టోరీ మూవీ పేరు ‘సూపర్ శరణ్య‘ (Super Saranya). 2022లో విడుదలైన ఈ మలయాళ లవ్ స్టోరీ కామెడీ మూవీకి గిరీష్ ఎ.డి దర్శకత్వం వహించగా, జస్టిన్ వర్గీస్ సంగీతం అందించారు. సూపర్ శరణ్య 7 జనవరి 2022న విడుదలైంది. ఈ మూవీ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకొని, వాణిజ్యపరంగా కూడా విజయం సాధించింది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee5) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
శరణ్య ఇంటర్ పూర్తి అవ్వడంతో, సిటీలో ఇంజనీరింగ్ చదవడానికి వస్తుంది. హాస్టల్లో ఉంటూ చదువుకునే శరణ్యకు, అక్కడున్న అమ్మాయిలు ఫ్రెండ్స్ అవుతారు. ఒకరోజు కాలేజీలో ర్యాగింగ్ జరగడంతో శరణ్య బాగా ఏడుస్తుంది. ఫ్రెండ్స్ ఆమెను ఓదార్చి ఇక్కడ ర్యాగింగ్ మామూలే అని సర్ది చెప్తారు. ఆ తర్వాత కాలేజీలో అజిత్ అనే సీనియర్ శరణ్య వెంటపడుతూ ఉంటాడు. చదువు చెప్పే మాస్టర్ కూడా శరణ్యను ఇష్టపడుతుంటాడు. అయితే శరణ్యకు వీళ్ళంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. మరోవైపు అనుకోకుండా పరిచయమైన దీపక్ శరణ్యకు సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు. శరణ్య ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి, అతనితో చాటింగ్ చేయడం మొదలు పెడుతుంది. అలా వీళ్ళిద్దరూ చాటింగ్ చేసుకుంటూ ఒకరికొకరు దగ్గరవుతారు. మరోవైపు అజిత్ పెళ్లి చేసుకుంటానని డైరెక్టుగానే శరణ్యకు చెప్తాడు. ఆరు నెలల సమయం కావాలని శరణ్య అడుగుతుంది.
ఇంతలో శరణ్య వేరొకరిని ప్రేమించడం చూసి, ప్రొఫెసర్ ప్రాక్టికల్స్ లో ఫెయిల్ చేస్తుంటాడు. ఇందుకు శరణ్య చాలా బాధపడుతూ ఉంటుంది. ఒకసారి ప్రొఫెసర్ కి కరెంట్ షాక్ తగలగా, శరణ్య కాపాడుతుంది. అప్పటినుంచి శరణ్యకి ప్రొఫెసర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అయితే అజిత్ కి ఇచ్చిన ఆరు నెలలు టైం అయిపోవడంతో, శరణ్య దగ్గరికి వచ్చి సమాధానం చెప్పమని అడుగుతాడు. అందుకు శరణ్య నిన్ను ఎప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదు అని చెప్తుంది. ఆ తరువాత అజిత్, శరణ్యని ఇబ్బంది పెడుతున్నాడని దీపక్ కి తెలుస్తుంది. దీపక్, అజిత్ ల మధ్య పెద్ద గొడవ అవుతుంది. గొడవ పెట్టుకున్నందుకు శరణ్య, దీపక్ తో మాట్లాడటం మానేస్తుంది. చివరికి శరణ్య ఎవరిని ప్రేమిస్తుంది? అజిత్ వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? తల్లిదండ్రులు వీరి ప్రేమను యాక్సెప్ట్ చేస్తారా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘సూపర్ శరణ్య’ (Super Saranya) మూవీని మిస్ కాకుండా చూడండి.