BigTV English

CM Revanth Reddy: బర్త్ డే రోజున పాదయాత్ర.. మూసీ పునరుజ్జీవంపై దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: బర్త్ డే రోజున పాదయాత్ర.. మూసీ పునరుజ్జీవంపై దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి

Musi River :


⦿ మూసీ పునరుజ్జీవనంపై ప్రభుత్వం దూకుడు
⦿ తీరం వెంట సీఎం రేవంత్‌ రెడ్డి పాదయాత్ర
⦿ పుట్టిన రోజైన 8న యాదాద్రి జిల్లాలో టూర్
⦿ ముందుగా యాదగిరి గుట్ట నరసింహ స్వామి దర్శనం
⦿ మంచి నీటి సరఫరా పథకానికి శంకుస్థాపన
⦿ వలిగొండ మండలం సంగెంలో పాదయాత్ర

హైదరాబాద్, స్వేచ్ఛ : మూసీ పునరుజ్జీవనం చుట్టూ జరుగుతున్న రాజకీయ రగడ అంతా ఇంతా కాదు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు గురించి ప్రకటించిన దగ్గరి నుంచి ప్రతిపక్షాలు ఏదో ఒక రూపంలో రాజకీయం చేస్తూనే ఉన్నాయి. అయితే, విపక్ష నేతల ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. మైకుల ముందు కూర్చుని ప్రజలను రెచ్చగొట్టే నాయకులకు, ప్రజల వద్ద నుంచి సమాధానం చెప్పేందుకు డిసైడ్ అయ్యారు. అందుకోసం మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్ర పేరుతో పాదయాత్ర చేసేందుకు ప్లాన్ చేశారు. మూసీ పరివాహక గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు.


బర్త్ డే రోజున ముహూర్తం

ఈనెల 8న సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు. అదే రోజున మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేయబోతున్నారు. అంతకు ముందు యాదగిరి గుట్టకు వెళ్లి, కుటుంబ సభ్యులతో కలిసి నరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు. తర్వాత, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని బొల్లేపల్లి నుంచి సంగెం, భీమలింగం వంతెన వరకు పాదయాత్ర సాగనుంది. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ యాత్ర చేయనున్నారు సీఎం. ఈ క్రమంలోనే మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు మంచినీటి సరఫరా కోసం నిర్మించనున్న పైప్ లైన్ ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేస్తారు.

ప్రజల ముందే తీర్పు

ఇప్పటికే ప్రభుత్వ, ప్రతిపక్ష నేతల మధ్య మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. గులాబీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే వాడపల్లి నుంచి తాను చేయనున్న పాదయాత్రకు కలిసి రావాలని నల్గొండ జిల్లా ప్రజలు మూసీ ప్రక్షాళనను కోరుకుంటున్నారా లేదా అని వారినే అడిగి తెలుసుకుందామంటూ ఛాలెంజ్ చేశారు. చెప్పినట్టుగానే ఈనెల 8 నుంచి మూసీ పునరుజ్జీవన ప్రజా చైతన్య పాదయాత్రను చేసేందుకు సిద్ధమయ్యారు సీఎం. నిజానికి మూసీ డెవలప్‌మెంట్ చేస్తామని గత ప్రభుత్వం అనేక మార్లు చెప్పింది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మాత్రం అసలు మూసీ ప్రక్షాళనే తప్పు అన్నట్టుగా నానా రాద్ధాంతం చేస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్ట్‌కి సూచనలు ఇవ్వాలని, అడ్డుకోవడం కోసం ప్రయత్నాలు చేయడం సమంజసం కాదని హెచ్చరిస్తున్నారు. అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది, హైదరాబాద్లోని మురికి నీరు, ఫ్యాక్టరీల వ్యర్థాలను కలుపుకొని అధ్వాన స్థితిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కాలుష్యంతో కూడిన ఆ నీటి కారణంగా పరీవాహక ప్రాంతంలో పంటలు కూడా పండని దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతాలను పరిశీలించి, ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి మూసీ పునరుజ్జీవనంపై ముందుకెళ్లేలా పాదయాత్ర చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Related News

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 26న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Singareni Employees: దసరా కానుకగా సింగరేణి కార్మికులకు భారీ బోనస్‌.. ఒక్కొరికి ఎంతంటే?

Hydra Ranganath: కబ్జాలకు చెక్.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై రంగనాథ్ ఏమన్నారంటే..

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు పడే ఛాన్స్..

Bathukamma: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు

Karimnagar Fire Accident: కరీంనగర్‌లోని రీసైక్లింగ్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Big Stories

×