Manmohan Singh: ప్రపంచమే గర్వించ దగిన ఆర్థికవేత్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈనాడు ఆయనతో పోటీ పడేవారు లేరన్నారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి.
మన్మోహన్ సింగ్ వివిధ హోదాల్లో దేశానికి సేవలు అందించారని తెలిపారు. ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ఆయనను పేర్కొన్నారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన్మోహన్ సింగ్ అందరికీ ఆర్థిక రూపశిల్పి మాత్రమే.. తెలంగాణకు మాత్రం ఆత్మబంధువని కొనియాడారు.
తెలంగాణకు రాష్ట్రానికి ఇచ్చిన గొప్ప మానవతావాది మన్మోహన్ సింగ్ అని, తెలంగాణలో ఆయనకున్న బంధం విడదీయరానిదన్నారు. తెలంగాణ సమాజం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుందన్నారు. ఫైనాన్స్ డిస్ట్రిక్ట్‌లోని ఓ ప్రాంతంలో డాక్టర్ మన్మోహన్‌సింగ్ విగ్రహావిష్కరణ చేయాలని సభ నిర్ణయించింది.
దీనిపై ఎవరైనా సలహాలు, సూచనలు ఇస్తే తీసుకుంటామన్నారు. తెలంగాణ గడ్డపై ఆయన విగ్రహం పెట్టాలనుకోవడం సముచితమైన నిర్ణయమని తెలిపారు. దీనికి సభ ద్వారా ఆమోదం తెలపాలని సభ్యులను కోరారు. కేవలం ఆర్థిక సంస్కరణలే కాదు.. భూసేకరణ చట్టం సవరణ చేసిన ఘనత మన్మోహన్ సింగ్‌కు దక్కుతుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
ALSO READ: బీఆర్ఎస్‌కు షాక్ తప్పదా? వచ్చే నెలలో వెల్లడి..!
సీఎం రేవంత్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానానికి మద్దతు తెలిపారు బీఆర్ఎస్ సభ్యులు. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలన్న తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామ న్నారు కేటీఆర్. ఈ పురస్కారానికి ఆయన పూర్తిగా అర్హులన్నారు. మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో ఏడాదిన్నరపాటు మంత్రి కేసీఆర్ పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది..
మన్మోహన్ సింగ్ గారికి తెలంగాణ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది.
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించండి… ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి అని మన్మోహన్ సింగ్ గారి సతీమణి చెప్పారు.
— ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… pic.twitter.com/zQTLELz9aJ— Congress for Telangana (@Congress4TS) December 30, 2024