BigTV English

China liuzhi Prisons : చైనాలో 200 కొత్త జైళ్ల నిర్మాణం.. ఎదిరిస్తే.. అవినీతి కేసులో లోపలికే..

China liuzhi Prisons : చైనాలో 200 కొత్త జైళ్ల నిర్మాణం.. ఎదిరిస్తే.. అవినీతి కేసులో లోపలికే..

China liuzhi Prisons | చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం నియంతృత్వ పాలన కొనసాగిస్తోంది. ప్రభుత్వాన్ని ఎదిరిస్తే.. ఆలస్యం ఉండదు.. వెంటనే జైలుకు తరలిస్తోంది. 2012 సంవత్సరంలో అధికారం చేజిక్కించుకున్న అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ క్రమంగా తనకు రాజకీయ శత్రువులను అంతమొందించారు. రాజకీయ శత్రువులనే కాదు.. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన సామాన్యులను, బడా వ్యాపారవేత్తలను సైతం నోరెత్తక్కుండా చేశారు. అయినా చైనా లాంటి పెద్ద దేశంలో ప్రభుత్వానికి వ్యతిరికించే వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అందుకే వారందరి కోసం ప్రత్యేకంగా 200 జైళ్లు నిర్మించిందని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ సిఎన్ఎన్ కథనం ప్రచురించింది. ఈ జైళ్లు చాలా ప్రత్యేకం వీటిని అక్కడ ‘లియుఝీ’ సెంటర్స్ అని అంటారు.


ఈ లియుఝీ డిటెన్షన్ సెంటర్స్ లో ప్రభుత్వంపై విమర్శలు చేసినా.. లేదా అవినీతి ఆరోపణలు ఎదుర్కింటున్నా వారిని అరెస్టు చేసి ఆరు నెలల వరకు లాయర్లు, కుటుంబ సభ్యులు.. ఎవరినీ కలవకుండా చేస్తారు. చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ ప్రస్తుతం మూడో సారి అధికారం చేపట్టారు. గత రెండు పర్యాయాలు ఆయన సొంత పార్టీ (కమ్యూనిస్టు పార్టీ)పై, మిలిటరీపై పూర్తిగా పట్టుసాధించారు. అయితే ఈ సారి ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులను తన కంట్రోల్ లో తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే అవినీతి నియంత్రణ పేరుతో లియుఝీ సిస్టమ్ తీసుకొచ్చారు.

2018లో కూడా ఇలాంటిదే ‘షుయాంగ్గుయి’ సిస్టం తీసుకొచ్చిందీ చైనా ప్రభుత్వం. అయితే పాత సిస్టంలో ప్రజలను తీవ్రంగా చిత్రహింసలు పెడుతున్నారని ప్రభుత్వాధికారులు, పోలీసులపై ఆరోపణలున్నాయి. అందుకే ‘షుయాంగ్గుయి’ సిస్టం స్థానంలో లియుఝీ ని తీసుకొచ్చారు. ఈ కొత్త సిస్టం ప్రకారం.. ప్రత్యేక జైళ్లకు 24 గంటలు భారీ భద్రత కోసం బయట మిలిటరీ సైనికులుంటారు. అరెస్టు చేసిన వారిని 24 గంటలు సిసిటివిలతో మానిటర్ చేస్తుంటారు. ఇప్పటివరకు ఈ జైళ్లలో కమ్యూనిస్టు పార్టీని వ్యతిరేకించిన వారే కాదు.. పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్న ప్రభుత్వాధికారులు, బడా కంపెనీల ఓనర్లు, మేనజర్లు కూడా ఉన్నారు.


Also Read: 2025 ప్రపంచంలో మృత్యు తాండవం.. సిరియా పతనమే పునాది.. బాబా వంగా జోస్యం

ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలా మంది వ్యాపారవేత్తలు కూడా ఈ జైళ్లలో ఖైదీలుగా ఉన్నారు. చైనా అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ బావో ఫాన్, మాజీ ఫుట్ బాల్ ఆటగారు లి టై, వీరిద్దరూ అవినీతి కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

గత అయిదు సంవత్సరాలలో అంటే.. 2017 నుంచి 2024మ మధ్య 2018 లియుఝీ జైళ్లు నిర్మాణం జరిగింది. వీటి పాత జైళ్ల ఆధునీకరణ, విస్తరణ లాంటివి చేశారు. కరోనా తరువాత ఈ జైళ్ల నిర్మాణం చాలా వేగంగా జరిగిందని రిపోర్ట్. అయితే కొంతమంది సామాజిక కార్యకర్తులు ఈ జైళ్లలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపిస్తున్నారు. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న చాలా మంది అధికారులకు చెందిన ఒక లాయర్ సిఎన్ఎన్ తో మాట్లాడుతూ.. “ఈ జైళ్ల లోపల అరెస్టు చేసిన వారిని విపరీతమైన చిత్రహింసలు పెడుతున్నారు. వారి కుటుంబాలకు హాని కలిగిస్తామని బెదిరిస్తున్నారు. వారందరిపై మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చి వారి చేత బలవంతంగా నేరాంగీకారం చేయిస్తున్నారు. ఆ చిత్రహింసలు భరించలేక చివరికి ప్రభుత్వం చెప్పినట్లు ఖైదీలు వినాల్సి వస్తోంది. నిర్దోషులు కూడా ఆ చిత్రహింసలకు భయపడి చేయని నేరం అంగీకరించాల్సి వస్తోంది.” అని చెప్పారు.

ఒక కేసులో అయితే చెన్ జియాన్‌జున్ అనే ఒక మాజీ ప్రభుత్వాధికారికి ఆరు నెలలపాటు రోజూ 18 గంటలపాటు నిటారుగా కూర్చోబెట్టారు. అతనికి రెండు గంటలే నిద్రపోయేందుకు అనుమతినిచ్చారు. ఇదంతా అతను ఒక టాయిలెట్ పేపర్ పై రాసి తన కూతురి ద్వారా పంపించాడు. ఖైదీలు చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. అందుకని ఇప్పుడు కొత్తగా జైళ్ల గోడలకు, నేలకు మెత్తని స్పాంజితో ప్యాడింగ్ చేశారు.

ఖైదు చేయబడ్డ వారిలో ఎక్కువ మందిపై ఆర్థిక నేరారోపణలే ఉన్నాయని.. వారిని అరెస్టు చేశాక వారి ఆస్తులు లాగేసుకుంటున్నారని చాలామంది ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడడం భవిష్యత్తులో చైనా ఎకానమీని తీవ్రంగా దెబ్బ తీస్తుందని ఆర్థికవేత్త ఝౌ టియాన్ యోంగ్ అభిప్రాయపడ్డారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×