Khairatabad Ganesh: దేశంలో గణేశ్ ఉత్సవాలకు ఖైరతాబాద్ ప్రసిద్ధి చెందిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిటీలో పెద్ద విగ్రహాలు ఎన్ని ప్రతిష్టించినా ఖైరతాబాద్ మహా గణపతి క్రేజ్ వేరని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఖైరతాబాద్ మహాగణపతిని సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు.
ఒక్కసారి నిర్వహణ కష్టమైన ఈ రోజుల్లో.. ఎన్ని ఇబ్బందులున్నా ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి దీన్ని కంటిన్యూ చేస్తోందన్నారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా, ప్రస్తుతం సీఎంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వినాయక మండపాలకు తొలిసారి ఉచితంగా విద్యుత్ ఇచ్చామన్నారు. ఈ ఘనత తమకే దక్కిందన్నారు.
భక్తుల మనోభావాలను ప్రభుత్వం గౌరవిస్తుందని, అన్ని పండుగలకు వేదిక హైదరాబాద్ అని చెప్పారు. అన్ని మతాలను గౌరవిస్తూ భాగ్యనగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. సిటీలో లక్షా 40,000 వేలకు పైగా విగ్రహాలను ప్రతిష్టించినట్టు తెలియజేశారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో సమస్యలు లేకుండా ఉత్సవాలను పూర్తి చేసుకున్నామని తెలిపారు.
ఈ ఉత్సవాలను విజయవంతంగా ముగించిన గణేశ్ ఉత్సవ సమితి సభ్యులను అభినందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం తరపున ఉత్సవ సమితికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని వెల్లడించారు సీఎం. 71 ఏళ్ల కిందట గణేశ్ ఉత్సవ సమితి ఒక్క అడుగుతో గణేశుడి ఉత్సవాలను ప్రారంభించిందన్నారు.
ALSO READ: ఫామ్ హౌస్‌లో కేసీఆర్ గణపతి హోమం
ప్రస్తుతం 69 అడుగుల గణపతిని ఏర్పాటు చేయడం ఆశామాషీ వ్యవహారం కాదని, ఇలాంటి కార్యాన్ని ఒక్కరోజు చేయడం తలకు మించిన భారమన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఖైరతాబాద్ విశ్వశాంతి మహా గణపతిని సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు.
ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ లు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ పూలమాల వేసి హారతిచ్చారు. ఆ తర్వాత అర్చకులు సీఎం రేవంత్‌రెడ్డికి ఆశీర్వచనం ఇచ్చారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. భాగ్యనగరంలో గణేషుడి నిమజ్జనం గురువారం నుంచి కొనసాగుతోంది.
71 ఏళ్ల క్రితం ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ ఈరోజు 69 అడుగుల ఎత్తుకు చేరుకున్నాడు: సీఎం రేవంత్ రెడ్డి
దేశంలో ఖైరతాబాద్ గణేష్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది
ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రతి ఏటా ఘనంగా గణేష్ ఉత్సవాలు చేస్తున్న కమిటీ సభ్యులకు అభినందనలు
టీపీసీసీ… https://t.co/NGUoK7oVW4 pic.twitter.com/wZbQVIPffx
— BIG TV Breaking News (@bigtvtelugu) September 5, 2025