Ganapathi Homam: బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత సమస్యలు సద్దుమణుగుతాయా? రానున్న రోజుల్లో రెట్టింపు అవుతాయా? ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో గణపతి హోమానికి గులాబీ బాస్ సిద్దమయ్యారు. రానున్న రోజుల్లో ఎలాంటి విఘ్నాలు కారు పార్టీని టచ్ చేయలేవా? అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు.
కష్టాలు వచ్చినప్పుడే ఎవరికైనా దేవుడు గుర్తుకు వస్తారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అదే చేస్తున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో గణపతి హోమం చేస్తున్నారు. కేసీఆర్, భార్య శోభ, కొడుకు కేటీఆర్‌లు ఈ పూజలో పాల్గొన్నారు. గణపతి హొమం చేస్తే కచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది.
ప్రతి ఏటా వినాయక చవితి నవరాత్రులలో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈసారి ఆ విధంగా చేస్తున్నారని అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. కవిత వ్యవహారం తర్వాత కొద్దిరోజులుగా ఫామ్‌హౌస్‌లో ఉన్నారు కేటీఆర్. హోమం తర్వాత ఆయన బయటకు రానున్నారు. లండన్ వెళ్లిన హరీష్‌రావు నేడో రేపో హైదరాబాద్‌కు రానున్నారు. ఈలోగా సమస్యలు ఓ కొలిక్కిరావచ్చని అంటున్నారు.
గత ఎన్నికల్లో ఓటమి నుంచి అనేక సమస్యలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి. తొలి ఏడాది కవిత జైలు, కేటీఆర్ ఫార్ములా కేసులు పార్టీని ఇబ్బందిపెట్టాయి. రెండో ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మరక నేరుగా కేసీఆర్-హరీష్‌రావును తాకాయి. రాజకీయంగా దాన్ని డైవర్ట్ చేయాలని భావించారు.
ALSO READ: ఏపీ-తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో హైఅలర్ట్
అదే సమయంలో కూతురు కవిత నుంచి విమర్శల వర్షం మొదలైంది. కాళేశ్వరం అవినీతిపై విమర్శలు, ఆ తర్వాత పార్టీ వేటు వేయడం, ఆమె తన పదవికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయింది. వరుసగా జరుగుతున్న పరిణామాలు పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు మిగతా నేతలకు అంతబట్టడం లేదు.
ఇదే అదునుగా భావించిన ఇటు కాంగ్రెస్-అటు బీజేపీ తమ విమర్శలకు పదునుపెట్టాయి. బీఆర్ఎస్ నేతలు ప్రజల్లోకి వెళ్లలేక సతమతమవుతున్నారు. కేవలం రాజధానికి పరిమితమయ్యారు. ఇంకోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గరైంది. రేపో మాపో నోటిఫికేషన్ రానుంది.
పార్టీని చుట్టిన సమస్యలపై కొంతైనా ఉపశమనం కలిగేలా హోమానికి దిగినట్టు పార్టీ వర్గాల మాట. ఈ లెక్కన కారు పార్టీని ఏ స్థాయిలో సమస్యలు చుట్టు ముట్టాయో అర్థం చేసుకోవచ్చు. వీటి నుంచి గట్టెక్కలేక కేసీఆర్ హోమాలు చేస్తున్నారని ప్రత్యర్థుల నుంచి కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.
ప్రత్యర్థుల కామెంట్స్ పక్కనపెడితే.. రేపు రానున్న సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కారు పార్టీ గెలుచుకుంటే బలపడతామని అంటున్నారు నేతలు. లేకుంటే ఫ్యూచర్ కష్టమేనన్న వాదన అప్పుడే మొదలైంది. ఈ సమస్య నుంచి గులాబీ బాస్ ఎలా బయటపడతారో వెయిట్ అండ్ సీ.
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ గణపతి హోమం
సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్ లతో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు పూజలో పాల్గొననున్న కేసీఆర్
ప్రతి ఏటా వినాయక చవితి నవరాత్రులలో కేసీఆర్ ప్రత్యేక పూజలు
ఐదు రోజులుగా ఫామ్ హౌస్ లోనే ఉన్న కేటీఆర్ pic.twitter.com/HFXwSPBuDW
— BIG TV Breaking News (@bigtvtelugu) September 5, 2025