Telangana Government: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. హైదరాబాద్‌ను న్యూయార్క్, టోక్యో వంటి ప్రపంచ నగరాలతో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోంది. మూసీ నది పునరుజ్జీవనం, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, సెమీకండక్టర్, రక్షణ రంగ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. రూ.1.5 లక్షల కోట్లతో హైదరాబాద్‌ను అద్భుత నగరంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వంటి ఆధునిక ప్రాజెక్టులతో రాష్ట్ర ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా చేసుకున్నారు.
వఅర్బన్, సబర్బన్, రూరల్ తెలంగాణగా రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా అభివృద్ధి చేసే లక్ష్యం ఉంది. మూసీ రివర్ ఫ్రంట్, సీవేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం ద్వారా నగర సమస్యలను పరిష్కరిస్తున్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, సన్న వడ్లకు రూ.500 బోనస్, రైతు భరోసా కింద ఎకరానికి రూ.12,000 సాయం వంటి పథకాలు అమలవుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధి విస్తరణ, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ద్వారా సామాజిక సంక్షేమం పెంపొందుతోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర డెవలప్ మెంట్ కోసం మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సహా నలుగురు మంత్రులను నియమిస్తూ కమిటీని ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనుల పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన కోసం కమినీ ఏర్పాటు చేసేందుకు రేవంత్ సర్కా్ర్ నిర్ణయం తీసుకుంది. కమిటీలో సభ్యులుగా నీటిపారుదల శాఖ, ఐటీ శాఖ, ఆర్ అండ్ బీ శఆఖ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రులు ఉండనున్నారు. భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పనులకు కమిటీ అనుమతి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ALSO READ: Heavy rains: కుండపోత వర్షం.. వారికి వర్క్ ఫ్రం హోం ఇవ్వండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..