Cockroach in Biryani: బిర్యానీ తినేందుకు రెస్టారెంట్‌కు వెళ్తే ఆర్డర్ చేసిన ఫుడ్‌లో బొద్దింకను చూసి కస్టమర్లు ఖంగుతిన్నారు. సిద్ధిపేటలోని ఓ రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని అక్షయ రెస్టారెంట్‌కు వెళ్తే తినే ఆహారంలో బొద్దింకలు దర్శనమివ్వడంతో కస్టమర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బిర్యానీ తింటున్న సమయంలో బొద్దింకలు ప్రత్యక్షం కావడంతో హోటల్ యాజమాన్యంపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ: HCUలో పొలిటికల్ డ్రామా
దీని గురించి రెస్టారెంట్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని కస్టమర్లు తెలిపారు. బొద్దింక ఎక్కడ ఉందంటూ తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారని వెల్లడించారు. పురుగులు ఉన్న ఆహారం ఇచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారంటూ మండిపడ్డారు.
బొద్దింకలు ఉన్న బిర్యానీ ఎలా పెడతారని ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారని తెలిపారు. అపరిశుభ్రమైన ఆహారాన్ని విక్రయించడమే కాకుండా దబాయించినందుకు రెస్టారెంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు.