Illu Illalu Pillalu Today Episode April 3rd : నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో అందరు సంతోషంగా ఉంటారు. భాగ్యం ఈ పెళ్లిని ఎలా చేయాలని ఆనందరావు ఆలోచిస్తూ ఉంటే మీరంతా కూల్ గా ఉండండి నేను సెట్ చేసేస్తాను కదా అనేసి అంటుంది . శ్రీవల్లిని చందు కి ఫోన్ చేసి రమ్మని అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్తుంది. చందుకు ఫోన్ చేసి మాట్లాడాలి అర్జెంటుగా మా ఇంటికి రండి అని పిలుస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ పెళ్లి పత్రికను చూసుకుంటూ సంతోషంగా ఉంటారు.. అందరూ పెళ్లి పత్రికను గురించి చూసి మురిసిపోతుంటే చందు మాత్రం అక్కడి నుంచి మెల్లగా జారుకుంటారు. చూసిన ధీరజ్ సాగర్ ఎక్కడికెళ్తున్నావ్ రా.. పెళ్లి కొడుకు అసలే బయటికి వెళ్లకూడదు. మేము కూడా నీతో పాటు వస్తామంటే చిన్న పని ఇప్పుడే వస్తానని చందు ఎంత చెప్పినా వాళ్ళు వినరు. మీ వదిన అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసింది అందుకే వెళ్తున్నా అనేసి అంటాడు. కానీ మేము వస్తాము అని అంటారు. అందరు కలిసి శ్రీవల్లి ఇంటికి వెళ్ళిపోతారు. చందును ప్లాన్ ప్రకారం పక్కాగా శ్రీవల్లి ఇరికిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. చందు శ్రీవల్లిని ఏదో మాట్లాడాలి అన్నారు చెప్పాలి కదా మీరు ఇలా మౌనంగా ఉంటే నాకేం తెలుస్తుంది అని అడుగుతాడు. ఒక చిన్న సమస్య వచ్చిందండి పెళ్లిని ఒక పది రోజులు వాయిదా వేద్దామని అడుగుతుంది శ్రీవల్లి. పెళ్లి వాయిదా అంటే చాలా కష్టం అంత సమస్యలు ఏమి వచ్చాయి అని చందు అడుగుతాడు. మాది ఫైనాన్స్ బిజినెస్ కాదండి కొంచెం ఇబ్బంది వచ్చింది. పెళ్లికి కావాల్సిన డబ్బులు చేతిలో లేవు. ఎవరికో హాస్పిటల్ లో అర్జెంట్ కావాలంటే మా నాన్న డబ్బులు ఇచ్చేసాడు ఒక పది రోజుల్లో మళ్ళీ డబ్బులు అడ్జస్ట్ అవుతాయి అంతవరకు పెళ్లిని వాయిదా వేసుకుందామని అడుగుతుంది.
ఇప్పుడు పెళ్లిని వాయిదా వేస్తే పరువు పోతుంది మా ఇంట్లో వాళ్ళు అస్సలు బతకలేరు అని చందు టెన్షన్ పడుతూ ఉంటాడు. మరి ఇప్పుడు పెళ్లి చేసే అంత పరిస్థితుల్లో మేము లేము కదా ఇప్పుడు ఏం చేయమంటారు మీరే చెప్పండి అని శ్రీవల్లి అడుగుతుంది. పెళ్లికి ఎంత ఖర్చులు కావాల్సి వస్తాయి అని చందు అడుగుతాడు. 10 లక్షల వరకు ఖర్చవుతుంది అండి అన్ని ఆల్రెడీ మాట్లాడి పెట్టుకున్నారు కానీ ఇప్పుడు డబ్బులు లేకుండా పిల్లల చేస్తామని ఆలోచిస్తున్నారని చెప్తుంది. అది విన్న చందు మీకు ఎలాగూ డబ్బులు వస్తాయి అని అన్నారు కదా ఆ పది లక్షలు నేను ఎలాగోలాగా అరేంజ్ చేస్తాను వచ్చిన తర్వాత మీరు ఆ డబ్బులు ఇవ్వాలి అని అంటాడు.
చందు మాటలు విన్న శ్రీవల్లి సంతోషపడుతుంది అయ్యో మీకు ఎందుకండి శ్రమ ఒక పది రోజులే కదా పది రోజుల తర్వాత మళ్లీ పెళ్లిని పెట్టుకుందామని అంటుంది శ్రీవల్లి.. ఇక వేదవతి తన తల్లి కోసం బయట ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రేమ తన తల్లి కూతుర్ల కోసం ఫ్యామిలీ సాంగ్ ని ప్లే చేస్తుంది దాంతో వేదవతి వాళ్ళమ్మ బయటికి వస్తుంది అందరూ కలిసి ఆ సాంగికి కనెక్ట్ అవుతారు. తన కొడుకు పెళ్లికి రావాలమ్మా అని వేదవతి అడుగుతుంది.
10 లక్షల గురించి ఇంట్లో డిస్కస్ చేస్తూ ఉంటారు. అప్పుడే బయటికి వెళ్లిన ధీరజ్, సాగరు ఇంటికి వస్తారు. పది లక్షల ఏంటి అన్నయ్య 10 లక్షలు గురించి మాట్లాడుతున్నావు అని చందు అని అడుగుతారు. 10 లక్షలు ఏం లేదురా పెళ్లికి ఎంత ఖర్చవుతుంది అని అడుగుతున్నారు అల్లుడుగారు అంటూ మధ్యలో భాగ్యం వస్తుంది. పెళ్లికి పది లక్షల వరకు ఖర్చు అవుతుంది అదే మాట్లాడుతున్నారని సరదాగా మాట్లాడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. చందు శ్రీవల్లి వాళ్ళకి 10 లక్షలు ఇస్తాడా లేక పెళ్లి ఆగిపోతుందా అన్నది రేపటి ఎపిసోడ్ లో చూడాలి..