E-Paper
Advertisement

Bandi Vs Eatala: బీజేపీ అగ్రనేతల మధ్య కోల్డ్ వార్.. పతాక స్థాయికి చేరిన పోరు

Bandi Vs Eatala: బీజేపీ అగ్రనేతల మధ్య కోల్డ్ వార్.. పతాక స్థాయికి చేరిన పోరు
Advertisement

Bandi Vs Eatala: కరీంనగర్ కాషాయ దళంలో కోల్డ్ వార్ నడుస్తోంది. జిల్లాలో బండి వర్సెస్ ఈటెల అన్న చందంగా తయారైంది. తాజాగా వీరిద్దరి మధ్య పోరు పతాక స్తాయికి చేరింది. ఈటల సొంతగడ్డ హుజురాబాద్ వేదికగా నేడు జరగబోయే పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం..బండి, ఈటల మధ్య అంతర్గత విభేదాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ సమావేశం కోసం హుజురాబాద్ పట్టణంలో బండి వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఈటల ఫోటో లేకపోవడంతో బీజేపీ రాష్ట్ర అగ్రనేతల మధ్య కోల్డ్ వార్ బహిర్గతమైంది.

ఫ్లెక్సీల్లో ఈటల రాజేందర్ ఫోటో అదృశ్యం..
హుజురాబాద్ మధువని గార్డెన్‌లో ఇవాళ కరీంనగర్‌ పార్లమెంట్ నియోజకవర్గ బూతు అధ్యక్షుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాజరుకానున్నారు. ఈ క్రమంలో బండి అనుచరులు..హుజురాబాద్ పట్టణాన్ని ఫ్లెక్సీలతో నింపేశారు. ఎక్కడ చూసిన బండి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. అయితే ఈ ఫ్లెక్సీల్లో కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతల ఫోటోలు ఉన్నా.. ఈటల రాజేందర్ ఫోటో మాత్రం ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశానికి ఈటల డుమ్మా ?
హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే అయిన ఈటల రాజేందర్… బండి సంజయ్‌ ఆధ్వర్యంలో జరిగే కరీంనగర్ పార్లమెంట్‌ బూత్‌స్థాయి సమావేశానికి రావడం అనుమానంగా మారింది. బండి సంజయ్, ఈటల మధ్య కోల్డ్ వార్‌ నడుస్తున్న క్రమంలో ఈటల రాకపోవచ్చని తెలుస్తోంది. అయితే హుజురాబాద్‌లో కరీంనగర్ పార్లమెంట్‌ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తుండగా..ఇందుకు పోటీగా రేపు హుజురాబాద్‌లో ఈటల పర్యటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన అనుచరులు ఈటల పర్యటన షెడ్యూల్‌ను ప్రకటించారు.

Also Read: నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం.. నవోదయ విద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య..

Advertisement

ఈటల, బండి కోల్డ్‌వార్‌తో రెండుగా చీలిన బీజేపీ కార్యకర్తలు
ఆధిపత్య పోరులో భాగంగానే బండి సంజయ్, ఈటల రాజేందర్.. ఒకరి తర్వాత ఒకరు పోటాపోటీ పర్యటనలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో పట్టు కోసం ఇప్పటికే బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు. ఇప్పటికే హుజురాబాద్‌ నియోజకవర్గంలో స్థానిక సంస్థలకు సంబంధించిన బీజేపీ బీఫారాలు తానే ఇస్తానని ఈటల ప్రకటించారు. ఈ క్రమంలో హుజురాబాద్‌పై పట్టు సాధించేందుకు బండి సమావేశాలతో దూసుకుపోతున్నారు. ఇద్దరి మధ్య కోల్డ్ వార్‌తో నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు పూర్తిగా ఈ రెండు వర్గాలుగా చీలిపోయి, అంతర్గత కుమ్ములాటలకు పాల్పడుతున్నారు.

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×