Collector Hanumantha Rao: పీ.ఎం.శ్రీ నిధుల నుండి మంజూరీ చేయబడిన పాఠశాలల్లో సివిల్ వర్క్స్ పనులను పెండింగ్ లేకుండా మార్చి, 15 వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. పీఎం శ్రీ క్రింద చేపట్టిన పనులను ఎంత మేరకు పూర్తి చేయడం జరింగిందని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల కు మంజూరైన నిధులను నిబంధనల మేరకు ఎంత మేర నిధులు వినియోగించారని ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పీఎం శ్రీ పథకం పరిధిలో ఉన్న పాఠశాలలలో సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, అదనపు తరగతి గదులు, లైబ్రరీ గదుల నిర్మాణం గురించి మంజూరైన నిధులను పాఠశాలలలో ఉన్న పనులను పూర్తి చేయాలని, పెండింగ్ లేకుండా త్వరగా పూర్తి చేయాలన్నారు.
Also Read: OpenAI – TCS Deal: ఏఐ రంగంలో టాటా సంచలనం.. చాట్ జీపీటీ మాతృ సంస్థతో.. టీసీఎస్ బిగ్ డీల్
కోటమర్తి, మల్లాపూర్, భువనగిరి గంజ్ పాఠశాలలలో సమస్యలను గుర్తించి, ఇంజనీర్ వాటిని నిర్మాణం పనులు త్వరగా ప్రారంభించేలా చూడాలని కలెక్టర్ ఇంజనీర్ ను ఆదేశించారు. పీఎం శ్రీ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం చేపట్టిన పనులను నిర్ణీత కాలవ్యవధిలో సక్రమంగా అమలయ్యేలా ప్రధానోపాధ్యాయులతో నిరంతర సమన్వయం పాటించాలని అన్నారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా విద్యాధికారి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాల ప్రసాద్, డివిజనల్ ఇంజనీర్ శివకుమార్, ప్రధానోపాధ్యాయులు, అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
Also Read: Anil Ravipudi: నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటో నేనే చెప్తా.. అంత వరకు కాస్త ఆపుకోండి!
భువనగిరి పట్టణంలో ఘనంగా ఛత్రపతి శివజి మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. హిందూ వాహిని యాదాద్రి భువనగిరి జిల్లా మరియు పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి పురస్కరించుకొని శోభాయాత్ర స్థానిక హనుమాన్ వాడ నుండి ప్రారంభం అయ్యి భువనగిరి పుర వీధుల్లో తిరుగుతూ నల్లగొండ చౌరస్తా శివాజీ విగ్రహం వరకు శోభాయాత్ర నిర్వహించడం జరిగింది.
ఈ శోభాయాత్రకు ముఖ్య అతిథిగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. భారీ జనసంద్రోహంగ శివాజీ మహారాజ్ ర్యాలీ భువనగిరి ప్రధాన వీధుల గుండా సాగింది. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, కౌన్సిలర్లు బింగి నరేష్, లాల్ రాజ్, జలగం విగ్నేష్, నరసింహారావు, హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు కడారి శివ యాదవ్, పట్టణ అధ్యక్షులు ఉదరి రాంరాజ్, బెల్లంకొండ చందు, రామగోని భాను, కందారి శ్రీధర్, పంచేదుల్ల భరత్, రావుల మహేష్, ఉడుతల భరత్, పవన్, ప్రణీత్, సాయి గణేష్, మరియు వివిధ క్షేత్ర కార్యకర్తలు మరియు వివిధ పార్టీల నాయకులు, పురప్రముకులు, యువజన సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.