E-Paper
Advertisement

Huzurabad News: మొలంగూర్ ఖిల్లా పరిసరాల్లోని ప్రభుత్వ భూముల పరిరక్షణపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి

Huzurabad News: మొలంగూర్ ఖిల్లా పరిసరాల్లోని ప్రభుత్వ భూముల పరిరక్షణపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి
Advertisement

Huzurabad News: హుజురాబాద్ స్వేచ్ఛ,  బ్యూరో: చారిత్రక నేపథ్యం ఉన్న మొలంగూర్ ఖిల్లా పరిసరాల్లోని ప్రభుత్వ భూముల పరిరక్షణపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. మండలంలోని మొలంగూర్ గ్రామంలో విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతోందన్న ఫిర్యాదుపై ఆమే సానుకూలంగా స్పందించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తెలంగాణ జన సమితి (TJS) జిల్లా అధ్యక్షుడు మోరే గణేష్ కలెక్టర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.

Also Read: T20 World Cup Semi Final Schedule: మార్చి 4 నుంచే సెమీస్ రేస్‌..టీమిండియా షెడ్యూల్ ఇదే, వ‌ర్షం ప‌డితే ఎలా

ప్రజా ప్రయోజనాలకు విఘాతం

Advertisement

గ్రామ పరిధిలోని క్రీ. శ 1461 కి సంబంధించిన ఇంటి మిద్దె గోడల లోపటి స్థలం పేరడీ నంబర్ 42లో, సుమారు 15 అడుగుల ఎత్తు ఉన్న మిద్దె గోడల లోపల దాదాపు 2 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమి ఖబ్జాకు గురైందని మోరే గణేష్ వివరించారు. ఈ భూమి బస్టాండ్‌కు సమీపంలో ఉండటంతో, ఇక్కడ నూతన గ్రామ పంచాయతీ భవనం, ఏఓ కార్యాలయం, గ్రంథాలయం, స్విమ్మింగ్ పూల్ వంటి ప్రజా ఉపయోగకర కట్టడాల నిర్మాణానికి ఎంతో అనువుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గతంలో స్థల సమస్య కారణంగా కొన్ని ప్రభుత్వ కార్యాలయాల మంజూరు నిలిచిపోయిన విషయాన్ని కూడా ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

కలెక్టర్ చొరవ.. విచారణకు ఆదేశం

వినతిపత్రాన్ని పూర్తిస్థాయిలో చదివిన కలెక్టర్, ఈ వ్యవహారంపై ప్రత్యేక విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. సాధారణంగా వచ్చే ఫిర్యాదుల కంటే భిన్నంగా, ఈ సమస్యలోని తీవ్రతను గుర్తించిన కలెక్టర్.. అంశాలన్నింటినీ తన వ్యక్తిగత డైరీలో ప్రత్యేకంగా నమోదు చేసుకోవడం విశేషం. భూ ఆక్రమణల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, ప్రజా ప్రయోజనాల కోసం భూమిని కాపాడతామని భరోసా ఇచ్చారు. తమ ఫిర్యాదుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన కలెక్టర్‌కు మోరే గణేష్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Also Read:PCB: ఒక్కో ప్లేయ‌ర్ రూ.50 ల‌క్ష‌లు జేబులోంచి క‌ట్టండి…పాక్ ప్లేయ‌ర్ల‌కు న‌ర‌కం చూపిస్తోన్న PCB 

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×