Cars Prices Hike From April Check out For Discounts | ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ వాహనాల ధరలు పెంచుతున్నట్లు ఇటీవలే ప్రకటించాయి. ఏప్రిల్ 1 నుంచి ధరలు పెరిగిపోతాయి. కానీ మార్చి నెల ముగియడానికి మరో 4 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో కారు కొనుగోలు చేస్తే మీరు భారీ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. ఇన్పుట్ ఖర్చులు పెరిగిన కారణంగా కంపెనీలు ధరలు పెంచవలసి వచ్చింది. అయితే, కొన్ని కంపెనీలు ఈ నెలలో పాత స్టాక్ క్లియర్ చేయడానికి ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లు ఇస్తున్నాయి. మారుతి సుజుకి, హ్యుందాయ్ వంటి బ్రాండ్ల కార్లు ఇప్పుడు కొనుగోలు చేస్తే మీరు పెద్ద మొత్తం సేవింగ్స్ చేయవచ్చు.
మారుతి సుజుకి కార్లపై 4 శాతం ధరల పెంపు
మారుతి సుజుకి తన ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారు బాలెనోపై ₹67,100 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. అలాగే.. బాలెనో రీగల్ ఎడిషన్‌పై ₹42,760 విలువైన యాక్సెసరీ ప్యాకేజీని కూడా అందిస్తోంది. ఆల్టో K10పై ₹83,100, స్విఫ్ట్‌పై ₹58,100, వాగన్-ఆర్ పై ₹73,100 వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ ఆఫర్లు మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ నుండి మారుతి కార్ల ధరలు 4 శాతం పెరిపోతాయి. ఆలస్యమైతే ఈ డిస్కౌంట్లు చేజారిపోతాయి.
Also Read: గుడ్ న్యూస్.. ఇక PFను ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు, UPIతో కూడా!
హ్యుందాయ్ కార్లపై ప్రత్యేక ఆఫర్లు, ఏప్రిల్ నుండి 3 శాతం ధరల పెంపు
హ్యుందాయ్ ఈ నెలలో తన కార్లపై గొప్ప డిస్కౌంట్లు ఇస్తోంది. ఐ20పై ₹50,000, వెన్యూ SUVపై ₹55,000, ఎక్స్టర్ కాంపాక్ట్ SUVపై ₹35,000, గ్రాండ్ i10 నియోపై ₹53,000 వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ ఆఫర్లు మార్చి 31 అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే అమలులో ఉంటాయి. ఈ డిస్కౌంట్లు ప్రధానంగా పాత స్టాక్ క్లియర్ చేయడానికి ఇవ్వబడుతున్నాయి. కాబట్టి, కొత్త కారు కొనాలనుకుంటున్న వారు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిది.
ఇతర బ్రాండ్లు కూడా ధరలు పెంచనున్నాయి
రెనాల్ట్, బీఎండబ్ల్యూ, కియా, హోండా వంటి కంపెనీలు కూడా ఏప్రిల్ నుండి ధరలు పెంచనున్నాయి. ఉక్కు, అల్యూమినియం, సెమీకండక్టర్ చిప్స్ ధరలు పెరగడం, లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడం వంటి కారణాల వల్ల ఈ ధరల పెంపు జరుగుతోంది. కంపెనీలు తమ ఉత్పత్తుల నాణ్యత, ఫీచర్లను తగ్గించకుండా ధరలు సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
Also Read: ఉగాది ప్రత్యేక ఆఫర్..రూ.4 వేలకే బ్రాండెడ్ 28లీటర్ల ఎయిర్ కూలర్
వినియోగదారులపై ప్రభావం
ధరల పెంపు వల్ల కొనుగోలుదారులు తమ బడ్జెట్ ప్రకారం వేరే మోడల్స్‌కు మారవచ్చు. ఉదాహరణకు, ఒక వినియోగదారు SUV కు బదులుగా సెడాన్ కారును ఎంచుకోవచ్చు. అయితే, ఏప్రిల్ ముందు కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ల ద్వారా మంచి ఆదా అవకాశం ఉంది.