BigTV English

Dimple Hayathi: డింపుల్‌ను డీసీపీ వేధించారా?.. అసలేం జరిగిందంటే…

Dimple Hayathi: డింపుల్‌ను డీసీపీ వేధించారా?.. అసలేం జరిగిందంటే…
Dimple Hayathi dcp

Dimple Hayathi: ఇవాళ రోజంతా ఒకటే న్యూస్. న్యూస్ ఛానెల్స్ అన్నీ డింపుల్ హయాతి గురించే బ్రేకింగ్స్ నడిపాయి. డింపుల్ వర్సెస్ డీసీపీ అంటూ నాన్‌స్టాప్ కవరేజ్ ఇచ్చాయి. అంత ఆసక్తికర విషయం అందులో ఏముంది?


హీరోయిన్ అంటేనే సేలబుల్ ఐటమ్. అందులో ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఉంటే. సీసీకెమెరా ఫూటేజ్ దొరికితే. ఇక పండుగే. అందుకే, ఈ న్యూస్ అంతగా వైరల్ అయింది. పోలీస్ స్టేషన్, కేసు, కోర్టు వరకూ వెళ్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే.. జూబ్లీహిల్స్‌ జర్నలిస్టు కాలనీలోని హుడా ఎన్‌క్లేవ్‌లో డీసీపీ రాహుల్‌ హెగ్డే ఉంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో నటి డింపుల్‌ హయాతి తన ఫ్రెండ్ డేవిడ్‌తో కలిసి నివసిస్తున్నారు. వాళ్లిద్దరి మధ్య కారు పార్కింగ్ విషయంలో కొంతకాలంగా గొడవ జరుగుతోంది. లేటెస్ట్‌గా, ఆమె తన కారుతో.. డీసీపీ వెహికిల్‌ను లైట్‌గా డ్యాష్ ఇచ్చారని చెబుతున్నారు. ట్రాఫిక్స్ కోన్స్‌ను కాలితో తన్ని తన ఫ్రస్టేషన్‌ చాటుకున్నారు. ఇంతే. ఇదే మేటర్. సీసీ ఫూటేజ్ ఉండటంతో.. డీసీపీ కారు డ్రైవర్.. హీరోయిన్ డింపుల్‌పై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. అసలే పై ఆఫీసర్. మాగ్జిమమ్ సెక్షన్లు పెట్టి.. డింపుల్ హయాతిని స్టేషన్‌కు పిలిపించారు. దీంతో ఆమెకు చిరాకొచ్చింది. లాయర్‌ను తీసుకొచ్చింది. కోర్టులో తేల్చుకుంటానని సవాల్ చేస్తోంది. తనకు మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు.

మరోవైపు, డింపుల్‌ తరఫు న్యాయవాది పాల్ సత్యనారాయణ మాత్రం మీడియాతో చాలానే ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. ఆయన ఏమన్నారంటే.. ‘‘డింపుల్‌తో డీసీపీ చాలాసార్లు అమర్యాదగా మాట్లాడారు. ఆమె పార్కింగ్ స్థలంలో కోన్స్ పెట్టారు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఆమె అసహనానికి గురై కోన్స్‌ను కాలితో తన్నారు. డీసీపీ ఆమెను వేధించాలనుకుంటున్నారు. ఆయన తన క్వార్టర్స్‌లో ఉండకుండా ఈ అపార్ట్‌మెంట్‌లో ఎందుకు ఉన్నారు? ఆయన ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నారు. సోమవారం ఆయనపై ఫిర్యాదు చేయడానికి డింపుల్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తె.. మూడు గంటలు అక్కడే కూర్చోబెట్టారు. ఫిర్యాదు తీసుకోకుండానే పంపించేశారు. కేసుపై న్యాయపరంగా పోరాటం చేస్తాం’’ అని ఆ లాయర్ ఇష్యూకి మరింత మసాలా అద్దారు.


ఈ కేసులో మరో ఇంట్రెస్టింగ్ మేటర్ కూడా బయటకు వచ్చింది. డింపుల్ హయాతిని డీసీపీ రాహుల్ హెగ్డే టార్గెట్ చేశారని చెప్పేందుకు మరో ఆధారం వాళ్ల చేతికి చిక్కింది. గడిచిన వారం రోజుల్లో డింపుల్ కారుకు ఏకంగా మూడుసార్లు ట్రాఫిక్ చలాన్లు పడ్డాయి. డీసీపీ ఒత్తిడితో పోలీసులు కావాలనే తమ కారును టార్గెట్ చేసి చలాన్లు వేయించారనేది ఆమె ఆరోపణ.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×