BigTV English

Ambani – Rohit: బలుపు తగ్గించుకో రోహిత్… అంబానీ వార్నింగ్?

Ambani – Rohit: బలుపు తగ్గించుకో రోహిత్… అంబానీ వార్నింగ్?

Ambani – Rohit: భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గత కొంతకాలంగా పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. ఐదు టెస్టుల ఆస్ట్రేలియా సిరీస్ లోనూ తన చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రోహిత్ శర్మ మొదటి టెస్ట్ కి దూరంగా ఉండగా.. ఆ మొదటి టెస్ట్ భారత జట్టు గెలుపొందింది. ఇక రెండవ టెస్ట్ కి రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించారు. ఈ టెస్ట్ లో భారత్ ఘోర ఓటమిపాలైంది.


Also Read: Yuvraj Singh on Rohit Virat: ఎవర్రా మీరంతా.. రోహిత్, కోహ్లీని తిట్టడానికి? యువరాజ్ సీరియస్!

అనంతరం జరిగిన మూడవ టెస్ట్ వర్షం కారణంగా డ్రా గా ముగిసింది. ఇక నాలుగవ టెస్ట్ లో మరోసారి ఓడిపోవడంతో చివరి టెస్ట్ లో అతడు బరిలోకి దిగలేదు. ఈ నేపథ్యంలో అతడి కెరీర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇక అతడు ఆటకు స్వస్తి పలకబోతున్నాడు అనే అనుమానాలు వెలువడ్డాయి. కానీ తాను రిటైర్ కావడం లేదని స్పష్టం చేశాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే రోహిత్ కి మరో షాక్ తగిలింది. ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ రోహిత్ శర్మ కి వార్నింగ్ ఇచ్చింది.


ఐపీఎల్ – 2025 కి ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటినుండే జట్లు ప్రిపరేషన్ మొదలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, బుమ్రా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి ప్లేయర్లకు అంబానీ వార్నింగ్ ఇచ్చారని సమాచారం. ఇప్పటినుండే జట్టు ఆటగాళ్లు అంతా కలసికట్టుగా ఉండాలని.. ఐకమత్యంతో ముందుకు వెళితేనే గెలుపు సాధ్యమవుతుందని సూచించారట. ఆటగాళ్ల మధ్య ఎటువంటి గొడవలు, అలకలు లేకుండా సక్యతగా ఉండాలని స్పష్టం చేసిందట.

వినకపోతే కఠిన చర్యలు ఉంటాయని ముంబై {Ambani – Rohit} యాజమాన్యం హెచ్చరించిందని సమాచారం. గత సంవత్సరం ట్రాన్స్ఫర్ విండో ద్వారా గుజరాత్ టైటాన్స్ జట్టు నుండి ముంబై ఇండియన్స్ లోకి వచ్చాడు హార్దిక్ పాండ్యా. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్నాడు. అయితే ఈ నిర్ణయం ఆ జట్టు అభిమానులకు నచ్చలేదు. దీంతో ముంబై మ్యాచ్ ల సందర్భంగా పాండ్యాని తీవ్రంగా గేలి చేసేవారు. జట్టులోని ఆటగాళ్లు సైతం పాండ్యాకి సహకరించలేదనే వార్తలు వెలవడ్డాయి.

ఈ క్రమంలో గత సీజన్ లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం 4 మ్యాచ్ లు మాత్రమే గెలుపొంది పాయింట్లు పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. దీంతో హార్దిక్ పాండ్ అని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తారని, లేదంటే రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, బుమ్రా, తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ జట్టును వీడతారని కథనాలు వచ్చాయి. కానీ ముంబై ఇండియన్స్ ఈ ఐదుగురు ఆటగాళ్లని రిటైన్ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే 2025 సీజన్ లో మరోసారి జట్టు సభ్యుల మధ్య విభేదాలు ఉండకుండా అందరూ ఐక్యంగా ఉండాలని ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ వార్నింగ్ ఇచ్చిందని తెలుస్తోంది.

Also Read: Harbhajan Singh: నువ్వు వచ్చి.. టీమిండియాను నాశనం చేశావ్ ? గంభీర్‌ పై భజ్జీ సీరియస్‌ !

ముంబై ఇండియన్స్ ఐపీఎల్ – 2025 జట్టు:

హార్దిక్ పాండ్యా (కేప్టెన్), బుమ్రా, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, బౌల్ట్, నమన్ ధీర్, రాబిన్ మింజ్, కర్ణ్ శర్మ, ర్యాన్ రికెల్టన్, దీపక్ చాహర్, అల్లా గజణ్ఫర్, విల్ జాక్స్, అశ్వని కుమార్, మిచెల్ శాంట్నర్, రీస్ టోప్లీ, కృష్ణన్ శ్రీజిత్, రాజ్ అంగద్, సత్యనారాయణ రాజు, బెవాన్ జాకబ్స్, అర్జున్ టెండూల్కర్, లిజాద్ విలియమ్స్, విగ్నేష్ పుత్తూరు.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×