E-Paper
Advertisement

Congress Complaint to EC: ఓటేసిన కేటీఆర్.. కవితపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

Congress Complaint to EC: ఓటేసిన కేటీఆర్.. కవితపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
Advertisement

Congress Complaint to EC: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో మంత్రి కేటీఆర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతీ పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే వాళ్లకే ఓటు వేశానని తెలిపారు.

ఎమ్మెల్సీ కవిత కూడా బంజారాహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఓటర్లనుద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు పోలింగ్‌ సందర్భంగా దుమారం రేపాయి. బీఆర్‌ఎస్‌ గుర్తయిన కారుకు ఓటు వేయాలని మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలను తప్పుపట్టిన కాంగ్రెస్‌ పార్టీ.. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని సీఈవోకి ఫిర్యాదు చేసింది. కవితపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. మంత్రి హరీష్ రావు – శ్రీనిత దంపతులు, కొడుకు అర్చిస్ మాన్ సిద్ధిపేటలో ఓటు వేశారు.

Advertisement

మంత్రులంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే హైదరాబాద్ లోని అంబర్‌పేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఓటు వేశారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. శేరిలింగంపల్లిలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ జూబ్లీహిల్స్‌ అభ్యర్థి అజారుద్దీన్, అతని కుమారుడు అసదుద్దీన్ ఓటు వేశారు.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×